The Desk…Vijayawada : విజయవాడలో పొరుగు రాష్ట్రాల శిశువులు – విక్రయానికి‼️

The Desk…Vijayawada : విజయవాడలో పొరుగు రాష్ట్రాల శిశువులు – విక్రయానికి‼️

  • బాబు ₹5లక్షలు
  • పాప ₹3లక్షలు
  • ఏలూరులో ముగ్గురు శిశువుల విక్రయం..‼️
  • పసికందులను విక్రయిస్తున్న మహిళల ముఠా అరెస్ట్

🔴 విజయవాడ : ది డెస్క్ :

ఉత్తరాది రాష్ట్రాల శిశువులను గుట్టుచప్పుడు కాకుండా విజయ వాడలో విక్రయిస్తున్న మహిళల ముఠాను టాస్క్ ఫోర్స్, శాంతిభద్రతల విభాగం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన ఇద్దరు మగపిల్లలు, ఒక పాపను తమ సంరక్షణలోకి తీసుకు న్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు విలేకర్లకు వెల్లడించారు.

ఆయన వివరాల మేరకు.. భవానీపురం కబేళా ప్రాంతానికి చెందిన బలగం సరోజిని (21). సంతానలేమితో బాధపడు తున్న మహిళలకు విజయలక్ష్మి అనే మహిళ ద్వారా ఎగ్స్ డొనేట్ చేసి డబ్బులు తీసుకునేది. ఇలాగే మరి కొందరితోనూ చేయించి కమీషన్ తీసుకునేది. హైద రాబాద్కు చెందిన ఓ మహిళ.. పిల్లలను విక్రయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆమెకు ఆశ చూపించింది. దీంతో దిల్లీకి చెందిన ప్రీతి కిరణ్, అహ్మదాబా దకు చెందిన అనిల్తో పరిచయం పెంచుకుంది. వారు పిల్లలను తీసుకువచ్చి సరోజినికి విక్రయించేవారు.

ఆమె రూ. 50వేల నుంచి రూ. లక్ష వరకు లాభం చూసుకుని.. బాబును రూ.5 లక్షలు, పాపను రూ.3 లక్షలకు విక్రయించేది. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన శిశువులను పాయకాపురం ప్రకాశ్నగ ర్లో ఉంటున్న తన బంధువులైన కొవ్వరపు కరుణశ్రీ (25), పెదాల శిరీష (26)లకు అప్పగిస్తే.. వారు సాకేవారు. కొనుక్కున్న వారికి శిశువులను అప్పగించ డానికి అజిత్సింగ్నగర్కు చెందిన షేక్ ఫరీనా (26), షేక్ సైదాబీ (33)లను నియమించుకుంది.

పక్కా సమాచారంతో దాడులు

ప్రకాశ్ నగర్ లో పసిపిల్లల విక్రయంపై టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. శనివారం తెల్ల వారుజామున పోలీసులు సోదాలు చేశారు. సూత్ర ధారి సరోజినితో పాటు సహకరిస్తున్న నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు చిన్నారులను.. శిశు సంరక్షణ అధికారులకు అప్పగిం చారు. మరో నలుగురు శిశువులను ఈ ముఠా విక్ర యించినట్లు గుర్తించారు. ఎవరికి విక్రయించారనేదా నిపై ఆరాతీస్తున్నారు. పోలీస్ కమిషనర్ ప్రత్యేక బృందాలను గుంటూరు, నరసరావుపేటకు పంపారు.

ముగ్గురిని ఏలూరులో విక్రయించినట్లు తేలడంతో.. మరో మూడు బృందాలు అక్కడకు చేరుకున్నాయి.

సరోజినిపై తెలంగాణ, మహారాష్ట్రలో కేసులు

బలగం సరోజినిపై తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధి మేడిపల్లి పోలీస్టేషన్లో గత ఏడాది మే 22న కేసు నమోదైంది. ఆ కేసులో ఆమె అరెస్టయి ఆగస్టులో బెయిల్పై బయటకు వచ్చింది. ఈమెపై ముంబయిలో మరో కేసు నమోదైంది.

ఈ రెండు కేసులూ.. పిల్లల్ని విక్రయించేవే కావడం విశేషం. ఈమె గత 9 నెలల్లో 26 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. జైలుకు వెళ్లొ చ్చినా పద్ధతి మార్చుకోకుండా అవే నేరాలకు పాల్ప డుతుండటంతో ఆమెపై పీడీ యాక్ట్ పెడతామని సీపీ పేర్కొన్నారు. నిందితులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

www.thedesknews.net