🔴 అమరావతి : విజయవాడ : THE DESK NEWS :
4,245 వేల ఎకరాలు కొల్లేరు ఆక్రమణలు తొలగించినట్లు సుప్రీంకోర్టుకు అఫిడవిట్లో తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్..!!
కొల్లేరు ఆక్రమణలు , అక్రమ చేపల చెరువుల తవ్వకాలు గురించి అదనపు అఫిడవిట్ దాఖలు చేయడం కొరకు సుప్రీంకోర్టును మరో రెండు నెలలు గడువు కోరిన చీఫ్ సెక్రటరీ..!!
లోగుట్టు పవన్ కు ఎరుకా..❓
కల్తీ నెయ్యి పై దృష్టి సారించారు – సీజ్ ద షిప్ అన్నారు – స్టెల్లా షిప్ ను నిలిపారు..!! కొల్లేరు పై కన్ను వేయరా అధ్యక్షా..‼️
ఏలూరు అటవీశాఖ పరిధిలో జరుగుతున్న రహస్యాలేమిటి❓ఎందుకింత గుట్టు..❓
సమాచారం రహస్యంగా ఉండాలని CMO కార్యాలయం చెప్పిందా..❓
ఇటీవల విజయవాడ వరద ముంపునకు ప్రధాన కారణం ఏమిటి..❓
విజయవాడ కన్నీరుకు – కొల్లేరూ కారణం కాదా..❓
బుడమేరు & కొల్లేరు – ఆక్రమణలకు గురికావడం వలనే!! కాదంటారా❓
29OCT2024 T0 8JAN2025 అంటే రెండు నెలల 10 రోజుల వ్యవధిలో … ఆక్రమణలకు గురైన కొల్లేరు నాలుగు వేల ఎకరాలు పైచిలుకు ధ్వంసమా..❓
4,245 వేల ఎకరాలు ఆక్రమణల కొల్లేరు చెరువులు ఎప్పుడు తొలగించారు❓
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా.. మీడియాకి తెలియజేస్తారు కదా..!! ప్రెస్ మీట్ పెడతారు- ప్రెస్ నోటు ఇస్తారు కదా..!!
ఇన్నివేల ఎకరాలు తొలగించినప్పుడు “మీడియాకు తెలియజేయకుండా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది”❓
ఆక్రమణలు తొలగింఛామని అంటున్నారు ..కానీ గండ్లు (తూతు మంత్రంగా) కొట్టారు..
ఆ గండ్లు కూడా ఆక్రమణదారులు మరల యధాతధంగా పూడుస్తున్న వైనం..❓
అసలు గండ్లు తూతూ మంత్రంగా కొట్టడం ఏంటి? చెరువు చుట్టూ ఉన్న గట్లన్నింటినీ పూర్తిగా తొలగించాలి కదా..❓
ఆక్రమించిన కొల్లేరుపై పర్యవేక్షణ శూన్యం..!!
మరింత సమాచారంతో.. ది డెస్క్ ఎక్స్ క్లూజివ్ స్టోరీ..!!
www.thedesknews.net