- రోజుకు మూడు లక్షల పై మాటే…
- పెత్తనం అంతా ప్రవేటు వారిదే…
- డాక్యుమెంట్ రైటర్లదే అక్కడి రాజ్యం…
- లంచాల ముసుగులో రిజిస్ట్రార్ లు…
- చోద్యం చూస్తున్న డిఐజి ఐజీలు…
- విజిలెన్స్ దాడులు నామమాత్రమే…
- అడ్రెస్ లేని ఏసీబీ అధికారులు…
- వారికి కూడా వాటాలు అప్పచెబుతున్నట్లు గుసగుసలు…
- లభో దిబో మంటున్న లబ్ధిదారులు….
- వాటాలకోసం కథలు వెతలు…
- కూటమి ప్రభుత్వం లో ఆగని కుట్రలు…
- ఇది బెజవాడ గాంధీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయ తీరు…
NTR జిల్లా : విజయవాడ : గాంధీనగర్ : THE DESK :
లక్షల్లో జీతాలు పుచ్చుకుంటున్న అది చాలదని ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకుని తినేందుకు ఏమాత్రం వెనుకాడని స్థితిలో ప్రభుత్వ అధికారులు ఉన్నారంటే ఎంత సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
బెజవాడ గాందినగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తీరు చూస్తే అవాక్కువుతున్నారు ఆ కార్యాలయ పరిధిలో ఉన్న ప్రజలు. ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ కావాలంటే అడిగినంత ఇచ్చుకుంటేనే గాని పనులు అయ్యే పరిస్థితి లేక పోవడం దారుణం.
తక్కువ లో తక్కువ రోజుకు మూడు లక్షల వరకు అవినీతి సొమ్మును వాటాల రూపంలో పంచుకుంటున్నట్లు అనేక ఆరోపణలు వినిపిస్తున్నా… పట్టించు కునే నాధుడు లేరన్నది వినిపిస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాలలో పనులు కోసం వచ్చేవారి నుంచి ఒక్క రూపాయి లంచం తీసుకోకూడదన్న ప్రభుత్వ పెద్దల మాటలు కేవలం ప్రసంగాలకే పరిమితం అవుతున్నాయనేది అక్షర సత్యం గా నిలుస్తుంది. విజిలెన్స్ పేరుతో ఎన్ని తనిఖీలు చేసినా ఆ తనిఖీల వల్ల ఎవరికి ఉపయోగం ఉందొ తెలియని పరిస్థితి.
ఇక అవినీతి నిరోధక శాఖ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చే అవినీతి సొమ్ముతో పూర్తిగా అవినీతి లో కూరుకు పోయిందనే అపవాదు మూట గట్టుకుంటుంది. ఆ శాఖలో ఉన్న ఉన్నత అధికారులు సబ్ రిజిష్టర్ లు ఇచ్చే పైసలతో పూర్తిగా పట్టించుకోకుండా పోయారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇలా అయితే రిజిస్ట్రేషన్ పనులకోసం వచ్చే వారి పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక ఆ కార్యాలయంలో అంతా ప్రవేటువారిదే పెత్తనం అన్న పదానికి నిదర్శనం గా నిలుస్తుంది గాంధీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం.
డాక్యుమెంట్స్ రైటర్ లు ఏది చెబితే అదే అక్కడ చెల్లుబాటు అవుతుందనేది అక్షర సత్యం. ఇన్ని రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నా వీరి ఆగడాలు కట్టడి చేసే వారెవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే…
ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో వేచి చూడాల్సిందే…