NTR జిల్లా : విజయవాడ : THE DESK :
నిర్నీత గడువులో గా సమాచారం ఇవ్వని పౌర సమాచార అధికారి నిర్లక్ష్యం పై అర్జీదారుడి వాదన తో ఏకీభవిస్తు రూ. 2వేలు అర్జీదారుడికి చెల్లించాలని ఏపీ సమాచార కమిషన్ తీర్పును వెల్లడించిoది.
వివరాల్లో కి వెలితే… ఎన్. టి. ఆర్ జిల్లా ప్రసాదంపాడు గ్రామానికి చెందిన ఎస్. సూర్య నారాయణరెడ్డి (సమాచారహక్కుచట్టం పరిరక్షణ సమితి అధ్యక్షులు) సమాచార హక్కు చట్టం 6(1)అనుసరించి పల్నాడు జిల్లా పరిధిలోని పి.ఎం.ఎం.ఎస్వై. పథకం ద్వారా జిల్లా పరిధిలో ని రిజర్వాయర్ లు, మైనర్ ఇరిగేషన్ చెరువుల నందు 2020-2021, 2022-2023 సంవత్సరాల మధ్య కాలంలో చేపల విత్తనాలు నిల్వ చేసుకునేందుకు మత్చ్యశాఖ ఉన్న తాధికారులచే జారీ చేయబడిన ఉత్తర్వులు మరియు చేప పిల్లల కొనుగోలు వివరాలకు సంబందించిన జిరాక్స్ ప్రతులను కోరడం జరిగింది.
సంబందిత మత్యశాఖ జిల్లా కార్యాలయ పిఐఓ ఆ యొక్క సమాచారంను అందజేయడంలో నిర్లక్ష్యం వహించడంతో అర్జీ దారుడు సూర్యనారాయణరెడ్డి మే25న ఏపీ సమాచార కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు ఫిర్యాదు పై విచారణ జరిపిన ఏపీ సమాచార కమీషన్ చావలి సునీల్ ఫిర్యాదుదారుడికి రూ 2వేలు చెల్లించాలని పిఐఓ ను ఆదేశించడం జరిగింది.
అయితే ఫిర్యాదు దారుడయిన సూర్య నారాయణరెడ్డి ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ… సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పు పై అసంతృప్తిని వ్యక్తo చేస్తున్నట్లు తెలిపారు.
చట్టoలో నిర్దేశించబడిన సమయంలోపు సమాచారమును ఇవ్వకుండా ఆర్టీఐ ను నిర్లక్ష్యం చేసిన పి.ఐ.ఓ కు సెక్షన్ 20(1) అనుసరించి రోజుకు రూ. 250 వరకూ, గరిష్టం గా రూ. 25వేల వరకూ జరిమాన విధించి ఆ సొమ్మును ప్రభుత్వానికి కట్టించాలని కోరితే దానికి విరుద్ధంగా ఈ విధమైన తీర్పుపై ప్రధాన సమాచార కమీషనర్ కు మరల పునర్విచారణ చేపట్టి చట్టబద్దమైన తీర్పును ఇప్పించాలని ఫిర్యాదు చేసి అవసరమైతే ఉన్నత న్యాయ స్థానం ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి నిర్ములన, జవాబు దారీ తనంను పెంపొoదించేoదుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
కానీ ఇటీవల కాలంలో కమీషన్ తీరు పట్ల అర్జీ దారులలో అసంతృప్తి నెలకొంటుదని ఆవేదన వ్యక్తం చేస్తూ సమాచార హక్కు పరిరక్షణ కోసo ఈ విధమైన తీర్పులపై న్యాయ పోరాటాలు అనివార్యo అవుతున్నాయని సూర్య నారాయణరెడ్డి తెలిపారు.