NTR జిల్లా : గుణదల : THE DESK :
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ నూతన అధ్యక్షుడుగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉట్టి నాగశయనం ఎంపిక కాబడ్డారు.
ప్రొద్దుటూరు దేవాంగ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడుగా ఉన్న నాగశయనం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. దేవాంగ కుల సంక్షేమనికి రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు.
ప్రస్తుత అధ్యక్షులు దేవాంగ కర్ణ నాగరాజు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో.. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడడంతో రాష్ట్ర సంఘం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు నాగశయనాన్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నారని, వారీ పదవులో అక్టోబర్ 2025 వరకు కొనసాగుతారని అసోసియేట్ అధ్యక్షులు తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.
ఆదివారం స్థానిక గుణదల శ్రీ చౌడేశ్వరి దేవాంగ సంక్షేమ సంఘం సమావేశ మందిరంలో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిలులో దేవాంగ కుల అభివృద్ధి కోసం పలు తీర్మానలు చేసారు. సందర్బంగా నూతన అధ్యక్షుడు నాగశయనం మాట్లాడుతూ… దేవాంగ కుల అభివృద్ధి ద్యేయంగా కృషి చేస్తానని అన్నారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ, రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు సజ్జ హేమలత, ఉప్పుగంటి రాజశ్రీ, కాలేపు సత్యనారాయణ, గుత్తి త్యాగరాజు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.