The Desk…Vijayanagaram : 9 న పైడితల్లి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం

The Desk…Vijayanagaram : 9 న పైడితల్లి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం

  • ఒక సంవత్సరం లో 1000 ఆలయాలు నిర్మాణం చేయడానికి సిద్ధం అయ్యాము
  • మా కూటమి ప్రభుత్వంలో ఆలయాలు నిర్మాణం చేస్తుంటే కొందరి నాయకులు టాయిలెట్లు కట్టాలని ఎద్దేవా చేస్తున్నారు

🔴 విజయనగరo : ది డెస్క్ :

ఈనెల 9వ తేదీన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. గోవా గవర్నర్, మాన్సాస్ చైర్మెన్ పూసపాటి అశోక్ గజపతిరాజు చేతులమీదుగా ఈ పనులను ప్రారంభిస్తామని చెప్పారు.

శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగ అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఆనం పట్టువస్త్రాలను సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచనాలు పలికి, అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ మాట్లాడుతూ… విజయనగరంలోని మూడు లాంతర్లు కూడలిలో వెలసిన ఈ అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఉత్తరాంధ్ర లో ప్రసిద్ధిగాంచిన దుర్గ అమ్మవారి అవతారాలలో ఒక అవతారమైనటువంటి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను జరపడానికి కంకణం కట్టుకుంది. పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు బహూకరించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది.

ఈ ప్రాంత వాసుల్లో ఈ రోజు ఇంచార్జి మంత్రి గా అనిత, స్థానిక మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ రావు శ్రీనివాస్ , స్థానిక శాసనసభ్యులు మరి అతిధి, అలాగే ఎమ్మెల్సీ గిరీష్మా , పార్లమెంట్ సభ్యులు అప్పల నాయుడు గారు అందరం కలిసి జిల్లా అధికారుల యొక్క సహకారంతో చాలా అద్భుతంగా ఈ ఉత్సవాలను జరపడానికి ఏర్పాట్లు అన్ని పూర్తి అయి గొప్పగా జరుగుతున్నాయి. ఈరోజు గోవా రాష్ట్ర గవర్నర్ అయినటువంటి ఈ ఆలయ ఫౌండర్ చైర్మన్ పూసపాటి అశోక గజపతి రాజు నాయకత్వంలో వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తుంది.

ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒకటి రెండు విషయాల్ని మీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత దేవాదాయ శాఖ మంత్రిగా నా పైన ఉన్నది.నేడు మా కూటమి ప్రభుత్వం 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖలో అనేక కీలక విషయాల్లో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ప్రకారం దేవాలయాలలో ఒక ప్రక్షాళన జరగాలి అని, ఆధ్యాత్మికతను పెంచాలి అని హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా హిందూ ఆలయాలు పట్ల హిందువుల యొక్క మనోభావాల్ని గుర్తించి హిందూ మనోభావాలకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆలయాల విషయంలో అనేక మార్పులు చేసుకుంటూ వస్తున్నాము..

అందులో భాగమే ఇవాళ అనేక ఆలయాల్లో కొత్త మార్పులు తీసుకొచ్చి ఆలయాల్లో ఎక్కడైతే నైవేద్యానికి కూడా నోచుకోని అనేక ఆలయాలలో ధూప దీప నైవేద్యం అనే పధకం ద్వారా ప్రతి నెల 10 వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి, నిధులు విడుదల చేస్తున్నాము. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 5523 ఆలయాల్లో ఈరోజు ఈ ధూప దీప నైవేద్యాల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది.. అలాగే కామన్ గుడ్ ఫండ్ రాష్ట్రంలో 210 ఆలయాలకి మేము వచ్చాక కొత్తగా పునః నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చాం దాదాపుగా 292.8 కోట్ల రూపాయలు సిజిఎఫ్ ద్వారా ఖర్చు అవుతుంది.

ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పురాతన ఆలయాలు మళ్లీ వెలుగులోకి తేవాలని వాటిలో ఉన్నటువంటి ఆలయాల్లో మనం పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మేరకు ఈనాడు మనం ఎన్నో చేస్తూ వస్తున్నాం. అలాగే ఈనాడు విజయనగరం ప్రాంతంలో ఈ జిల్లాలో కూడా 112 దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల్ని మంజూరు చేసి ప్రతి నెల పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.

ఆ మంజూరు చేసిన ప్రతినెల ప్రతి మాసం నెలకు పదివేల రూపాయలు డబ్బు విడుదల చేస్తూ ఉన్నాము. అలాగే కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఏడు ఆలయాలు లో మూడు కోట్ల తొంబై రెండు లక్షలు రూపాయలు మంజూరు చేసి పునర్నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.అలాగే పైడితల్లి అమ్మవారికి నిర్మాణ కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ప్రతిష్టాత్మకంగా కొలిచే ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయ పునః నిర్మాణ పనులను అశోక్ గజపతిరాజు స్థానిక శాసనసభ్యురాలు కోరిక మేరకు కోటి 80 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రేపు 9వ తారీఖున గవర్నర్ అశోక్ గజపతిరాజు శంకుస్థాపన చేయడానికి శ్రీకారం చుట్టారు.

ఆలయం ను ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా మెరుగైన సేవలు అందించాలి అని ఇంకా మెరుగైనటువంటి ఫలితాల్నిఇవ్వాలని, సామాన్య ప్రజలకు అందించడానికి ఇంకా అవసరమని భావించి అదనంగా నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ సిద్ధంగా ఉంది అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.సీజీఫ్ ద్వారా ఏడు ఆలయాలకు మూడు కోట్ల 92 లక్షల నిధులు మంజూరు చేసాం. అలాగే మొత్తం పనులు 27 పనులు మొదలు పెడితే 20 పనులు పూర్తయ్యాయి.

15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇంకా కొన్ని ఆలయాలు పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా కొత్తగా ఏడు ఆలయాలు ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతంలో చిన్న పెద్ద ఆలయాలు ఎన్ని ఉన్నా సరే అన్ని ఆలయాలు పునర్నిర్మానం చేయడానికి నిధులు విడుదల చేయడానికి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సిద్ధంగా ఉంది.

గడిచిన ఐదేళ్లలో వైసిపి హయాంలో అనేక విధాలుగా హిందూ ఆలయాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. నిర్లక్ష్యం చేయడమే కాదు అసలు ఆలయాల పరిరక్షణ కూడా గాలికి వదిలి పెట్టి ఆనాటి వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం హిందూ సనాతన ధర్మాలు కనుగుణంగా ప్రతి ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రజల యొక్క అనుభవాలకి పెద్దపీట వేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం.

నేడు మా కూటమి ప్రభుత్వం హయాంలో ఘనంగా దసరా ఉత్సవాలు అలాగే శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అద్వితీయంగా జరిపాము. బహుశా రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత ఇంత గొప్పగా కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క ఉత్సవాలు విజయవాడలో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్ని తిరుమలలో గాని ఇంత వైభోగంగా జరిపినటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు ఇంత గొప్పగా జరగలేదు.

ఇవాళ ఈ ప్రభుత్వం గర్వంగా చెప్తుంది పాలకవర్గాలు సహాయంతో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు, అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఒక వైభవోపేతమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించడం జరిగింది.

ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి దాన్లో ఆలయాలు నిర్మాణం చేయడానికి శ్రీవాణి పధకం కింద ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వారు,

రాష్ట్ర దేవాదాయ శాఖ సమన్వయంతో ఒక్క సంవత్సరం లో 1000 ఆలయాలు నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. దురదృష్టం ఏంటంటే ఆలయలు నిర్మాణం చేయాలని మా ప్రభుత్వం కంకణం కట్టుకుంటే, ఆలయాలు ఎందుకు టాయిలెట్లు కట్టండి అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు కొందరు నాయకులు. ఆలయాలు పునః నిర్మాణం చేస్తుంటే మరికొందరు నాయకులు అడ్డుపడుతున్నారు ఇది దురదృష్టకరం..

కాబట్టి ఎవరు ఏమన్నా హిందూ ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాలను ఆచారాలను ప్రతి ఆలయంలో పూజ కైంకర్యాలను చేయడానికి హిందువులకు మనోభావాలు దెబ్బ తినకుండా వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పునర్నిర్మాణం చేయడం మా కూటమి ప్రభుత్వ లక్ష్యం.