విజయనగరం జిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం : THE DESK NEWS :
విజయనగరం జిల్లా బొండవల్లి పోలీసు స్టేషనులో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు బొండపల్లి మండలం, బొండపల్లి గ్రామానికి చెందిన గొండేల చంద్రయ్య అలియాస్ శ్రీనివాస్ (44సం.లు)కువిజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి మూడు సంవత్సరాలు ఖైదు, రూ.2000/-లు జరిమానా విధిస్తూ జనవరి 28న తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం, బొండపల్లి గ్రామానికి చెందిన గొండేల చంద్రయ్య శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక మైనరు బాలిక ఆడుకుంటున్న సమయంలో సదరు బాలికను మామిడి తోటలోకి తీసుకువెళ్ళిఅత్యాచారం చేయడానికి ప్రయత్నించగా గ్రామస్తులను చూచి పారిపోయాడని బొండపల్లి పోలీసు స్టేషనులో బాలిక తల్లిఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి బొండపల్లి ఎస్ఐ వాసుదేవు కేసు నమోదు చేసారు. ఈ కేసును అప్పటి బొబ్బిలి సబ్డివిజన్ డిఎస్పీ బి.మోహనరావు దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయ స్థానంలో అభియోగపత్రం దాఖలు చేసారు.
సకాలంలో సాక్షులను, సాక్ష్యాధారాలను న్యాయ స్థానంలో ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషనుత్వరతిగతిన పూర్తి చేసి నిందితుడికి శిక్షపడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. నిందితుడు గొండేల చంద్రయ్య అలియాస్ శ్రీనివాస్ పై నేరారోపణలు రుజువు కావడంతో స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి నిందితుడు గొండేల చంద్రయ్య అలియాస్ శ్రీనివాస్ కు మూడు సంవత్సరాల కారాగారం మరియు రూ.2000/-లజరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు.
ఈ కేసులో నిందితుడిపైw నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారితరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం.ఖజానారావు వాదనలు వినిపించగా, గజపతినగరం సర్కిల్ సిఐ జిఎవి రమణ పర్యవేక్షణలో బొండపల్లి ఎస్ఐ యు.మహేష్, కోర్టు హెడ్ కానిస్టేబులు ఎం.ప్రకాష్ రావు, సిఎంఎస్ హెచ్సిరామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారన్నారు. పోక్సో కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.