The Desk…Vijayanagaram : ట్రాన్స్ఫార్మర్స్ లో రాగి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

The Desk…Vijayanagaram : ట్రాన్స్ఫార్మర్స్ లో రాగి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

విజయనగరం జిల్లా : THE DESK :

ఆరు పోలీసు స్టేషను పరిధిలో 10 కేసుల్లో ట్రాన్స్ఫార్మర్స్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

ట్రాన్స్ ఫార్మర్స్లోలో చోరీ చేసిన రాగిని కరిగించి, దిమ్మలుగా మార్చిన నిందితులు

రూ. 1.50 లక్షల విలువైన రాగి, అల్యూమినియం దిమ్మలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, చీపురుపల్లి, ఆండ్ర, బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ను చోరీ చేసిన బృందంలోని చీపురుపల్లి మండలం పేరిపి గ్రామానికి చెందిన ఎలక గణేష్ (25సం.లు) అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి రూ. 1.50 లక్షల విలువైన రాగి, అల్యూమినియం దిమ్మలను రికవరీ చేసినట్లుగా సెప్టెంబరు 2న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ… నెల్లిమర్ల మండలం కొండవెలగాడ, కొత్తపేట, గుషిని, పారసాం, చంద్రంపేట గ్రామాల్లో వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఎలక్ట్రికల్ డిపార్టుమెంటు వారు ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ చోరీలకు గురయ్యాయి. అదే విధంగా పూసపాటిరేగ, డెంకాడ, చీపురుపల్లి, ఆండ్ర, బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలో కూడా ఇదే తరహా నేరాలు జరగడంతో, తీవ్రంగా పరిగణించి, అప్రమత్తమై, నిందితులను పట్టుకొని, నేరాలకు అడ్డుకట్ట వేయాలని విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావును ఆదేశించడంతో, సిసిఎస్ సిఐ ఎ.సత్యన్నారాయణ, భోగాపురం సిఐ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టామన్నారు. సిసిఎస్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు నెల్లిమర్ల ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి సెప్టెంబరు 2న (సోమవారం) ఉదయం మిమ్స్ ఆసుపత్రి సమీపంలో వాహన తనిఖీలు చేపడుతుండగా, గుర్ల వైపు నుండి విజయనగరం వైపు వస్తున్న ఒక ఆటోలో వెనుకన కూర్చున్న ఒక వ్యక్తి, పోలీసు తనిఖీలను చూసి, ఆటో దిగి, ఒక మూటతో పారిపోతుండగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేసారాన్నారు. విచారణలో సదరు వ్యక్తి తనది చీపురుపల్లి మండలం పేరిపి గ్రామమని, తన బంధువులైన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన సారికి దుర్గారావు, సారికి సురేష్ మరియు ముంగిన అజిత్ కుమార్ కలిసి తన ఇంటికి చుట్టంగా వచ్చినారని, అందరూ చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి, డబ్బుల కోసం ట్రాన్స్ఫార్మర్స్ దొంగిలించాలనే ఉద్ధేశ్యంతో వారి కారులో అందరం కలిసి నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, చీపురుపల్లి, ఆండ్ర, బొబ్బిలి పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు ట్రాన్స్ఫార్మర్స్ ను చోరీ చేసామని, దొంగిలించిన రాగి, అల్యూమినియం వైరులను వారు కొవ్వూరు తీసుకొని వెళ్ళిపోయి, తన వాటాగా 10 రాగి దిమ్మలను, 2 అల్యూమినియం దిమ్మలను ఇచ్చారన్నారు. వాటిలో మూడు దిమ్మలను సెప్టెంబరు 2న విక్రయించేందుకు ఆటోలో వెళ్ళుతుండగా నెల్లిమర్ల పోలీసులకు పట్టుబడినట్లు తెలిపినాడన్నారు. నిందితుడు ఎలక గణేష్ దాచిపెట్టిన మిగిలిన రాగి దిమ్మలను, అల్యూమినియం దిమ్మలను కూడా నెల్లిమర్ల పోలీసులు రికవరీ చేసారని, రికవరీ చేసిన రాగి, అల్యూమినియం దిమ్మల విలువు సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని, నిందితులు ఆరు పోలీసు స్టేషనులో 10 కేసుల్లో నేరాలకు పాల్పడినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. మిగిలిన నిందితులు కూడా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులకు పట్టుబడ్డారని, ప్రస్తుతం వారు కూడా రిమాండ్ లో ఉన్నారన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన సిసిఎస్ సిఐ ఎ.సత్యన్నారాయణ, భోగాపురం సిఐ జి.రామకృష్ణ, నెల్లిమర్ల ఎస్ఐ రామ గణేష్, సిసిఎస్ పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, సిసిఎస్ సిఐ ఎ.సత్యన్నారాయణ, భోగాపురం సిఐ జి.రామకృష్ణ, ఎస్బి సిఐ కే.కే.వి.విజయనాధ్, నెల్లిమర్ల ఎస్ఐ రామ గణేష్ మరియు సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.