The Desk…Vemagiri : “స్వచ్చాంద్రా – స్వర్ణాంధ్ర” ప్లాస్టిక్ భూతాన్ని కలిసికట్టుగా తరిమికొడదాం ➖ జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి

The Desk…Vemagiri : “స్వచ్చాంద్రా – స్వర్ణాంధ్ర” ప్లాస్టిక్ భూతాన్ని కలిసికట్టుగా తరిమికొడదాం ➖ జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి

🔴 తూ.గో జిల్లా : కడియం మండలం : వేమగిరి : ది డెస్క్ :

పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని కలిసి కట్టుగా తరిమి కొడదామని జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా మూడో శనివారం స్వచ్చాంద్రా – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను రూపొందించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ శనివారం ప్లాస్టిక్(ఒక్కసారి వాడి పడేసే)నిషేధంకు సంబంధించి ఆయా గ్రామపంచాయతీ కార్యాలయా వద్ద గ్రామసభ నిర్వహించారు. కడియం మండలం వేమగిరి పంచాయతీ గ్రామ సభలో డిపిఓ శాంతామణి పాల్గొన్నారు.

సందర్భంగా DPO మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాస్టిక్ నిషేధంకు సంబంధించి జీవో నెంబర్ 81 అమలు చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు.

అందువల్ల ప్లాస్టిక్ విక్రయాలు ఎక్కడ చేపట్టినా కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. పలు షాపుల వద్దకు వెళ్లి అక్కడ ప్లాస్టిక్ విక్రయాలుపై ఆమె ఆరా తీశారు. ఇకపై ప్లాస్టిక్ విక్రయాలు చేపడితే ప్రభుత్వం నిర్ణయించిన అధిక మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులకు ఆమె హెచ్చరించారు.

గ్రామసభ అనంతరం వేమగిరి జంక్షన్ వరకు పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు తో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం సంబంధించిన ప్లే కార్డులు ప్రదర్సించి,నినాదాలు చేసారు. అలాగే ప్రభుత్వం రూపొందించిన ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో ఎంపీడీవో కె. రమేష్, డిప్యూటీ ఎంపీడీవో ఎన్.శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రూప్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.