🔴 పగో జిల్లా : భీమవరం నియోజవర్గం : వీరవాసరం : ది డెస్క్ :

వీరవాసరం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా..రైతుల గృహాల వద్దకు వెళ్లి… ప్రభుత్వం రైతుల కోసం చేసే కార్యక్రమాల్ని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు వివరించారు.
ఈ సందర్భంగా కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మీద రైతాంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, త్రాగునీటి సంఘాలు ఎన్నికలు జరగడం, ప్రతి ములుగు కాలువలు గాని పంట కాలువలు గాని సమృద్ధిగా పనిచేయించడం, అన్ని కార్యక్రమాలు చేపట్టారు.. అదేవిధంగా సూపర్ సిక్స్ లో భాగంగా.. రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి ఉచితంగా ఇవ్వటం మూడు విడతలుగా.. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ స్కీం ద్వారా అందించడం.. ప్రతి రైతు ధాన్యం పండించిన 21 రోజులలోపే వారి ఖాతాల్లోకి జమ కావటం..
ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఆధ్వర్యంలో.. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ.. ఈ నియోజకవర్గంలో సీత రామలక్ష్మి ఆధ్వర్యంలో.. ప్రతి రైతు కుటుంబానికి వెళ్లి మనం రైతులకు ఏ కార్యక్రమం చేస్తున్నామో వివరించే పనిలో కూటమి నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశించడం జరిగిందని, అదేవిధంగా సూపర్ సిక్స్ పథకంలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి కార్యక్రమాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని నడిపించడం జరుగుతుందని, రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోళ్ల నాగేశ్వరరావు కోరారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు
TDP Leader Highlights Farmer Welfare Schemes in Veeravasaram Door-to-Door Campaign
TDP State Secretary Kolla Nageswara Rao participated in the “Raitanna Meekosam” (For the Farmer) program here, visiting farmers’ homes to explain government initiatives boosting agriculture.
Addressing gatherings, kolla nageswaRao praised the coalition government’s focus on farmers since coming to power in Andhra Pradesh. “Thorough attention to the agriculture sector, elections for water user associations, and ensuring every canal—whether main or field—functions efficiently have been prioritized,” he said. He highlighted the Super Six scheme’s unprecedented ₹20,000 annual investment per farmer, disbursed in three installments via PM Kisan Anna Data Sukhibhava, with paddy payments credited within 21 days.
Under Chief Minister Chandrababu Naidu, Deputy CMs Lokesh and Pawan Kalyan, and Agriculture Minister Acchem Naidu’s leadership, the program—led locally by Sita Ramalakshmi—urges coalition leaders to inform every farmer family. “Chandrababu’s vision delivers unique welfare and development; farmers should bless the government,” kolla nageswaRao urged.
Local TDP leaders and farmers attended.

