🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : ది డెస్క్ :
ఉంగుటూరు MLA ధర్మరాజు ఈరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో మండల స్థాయి అధికారులoదరితో మీటింగ్ నిర్వహించి…మొంథా తుఫాన్ కు సంబంధించి ఏర్పాట్లు సమీక్షించడం జరిగింది. ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది.
వారికి తగిన వసతులు ఉన్నదీ లేనిది అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు.
ఎక్కడ, ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరిగినా.. వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నాలుగు మండలాల ఎంపీడీవోస్, ఎమ్మార్వోలు మరియు ఎస్సైలు పాల్గొన్నారు.

