The Desk…Unguturu : ప్లాస్టిక్ నివారణకు ప్రతిజ్ఞ చేయించిన అధికారులు

The Desk…Unguturu : ప్లాస్టిక్ నివారణకు ప్రతిజ్ఞ చేయించిన అధికారులు

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు గ్రామ పంచాయతీ : ది డెస్క్ :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛఆంధ్ర – స్వచ్ఛదివస్ కార్యక్రమంలో భాగంగా… ఉంగుటూరులో…సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కొరకు గ్రామసభ నిర్వహించి, గ్రామంలో ర్యాలీ నిర్వహించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకు గ్రామంలో విద్యార్థులు, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన ఉంగుటూరు పంచాయతీ సిబ్బంది.

అదేవిధంగా గ్రామంలో పలు షాపులకు వెళ్లి ప్లాస్టిక్ కవర్ల వాడకం క్రమేపి తగ్గించాలని వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు, అనంతరం జరిగిన ర్యాలీలో ప్రతిజ్ఞ చేసి స్వచ్ఛత పరిశుభ్రత పై ప్రజల్లో చైతన్యం రావాలని హితవుపలికారు.మరియు షాప్ యాజమానులకు, గ్రామస్తులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకు, తడి-పొడి చెత్తపై అవగాహన కొరకు కరపత్రాలు పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది.

కార్యక్రమంలో ఉంగుటూరు సర్పంచ్ బండారు సింధు, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ , జూనియర్ అసిస్టెంట్ రామోజీ, కూటమి నాయకులు, వార్డ్ సభ్యులు. సచివాలయం సిబ్బంది, హెల్త్ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.