The Desk…Unguturu : వ్యవసాయ, ఉద్యానవన పంటలు నష్టం అంచనాలను వేగవంతం చెయ్యాలి

The Desk…Unguturu : వ్యవసాయ, ఉద్యానవన పంటలు నష్టం అంచనాలను వేగవంతం చెయ్యాలి

  • జరిగిన ప్రతి నష్టాన్ని పారదర్శంగా అంచనాలను రూపొందించి పూర్తిస్థాయిలో నివేదికలు అందించాలి
  • నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వ పరంగా సాయం అందిస్తాము, ఏ ఒక్క రైతు ఆందోళన చెందవద్దు

తుఫాన్ కారణంగా ఉంగుటూరు మండలంలో దెబ్బతిన్న పంటలను అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

🔴 ఏలూరు/ఉంగుటూరు : ది డెస్క్ :

ఉంగుటూరు మండలం నాచుగుంట బ్రిడ్జి నుండి కాగుపాడు వరకు మరియు నారాయణపురంలో దెబ్బతిన్న పంట పొలాలను, నారాయణపురంలో ఇటీవల మరమ్మత్తులు చేసిన వంతెనను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని వారినుండి తెలుసుకుని వారికి ధైర్యాన్ని నింపారు.

సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రి సెల్వి మాట్లాడుతూ…

మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలు వివరాలు పూర్తి స్థాయిలో అంచనా వేసే కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల, గ్రామ స్థాయి సిబ్బందితో పరస్పర సమన్వయంతో నష్టం అంచనాలు రూపొందించడం నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమతం చేయడంతో ప్రజలంతా సహకరించారని ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు కృషి చేశామన్నారు.

కొంతమేర ఆస్తి నష్టం, పెద్ద మొత్తంలో వరి, ఉద్యానవన పంటలు పంట నష్టం జరిగిందన్నారు. రైతులు శ్రమించి పండించిన వరి పొట్ట దశలోనే నేలకు ఒరిగిపోవడం చాలా నష్టాన్ని మిగిల్చిందని ఇది చాలా బాధాకరం అన్నారు. తుఫాన్ సమయంలో ప్రజలు జిల్లా యంత్రాంగం సూచనలు పాటిస్తూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

తుఫాను బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. నేలకొరిగిన వరి, ఉద్యానవన పంటలు ఎన్యూమరేషన్ కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టడం జరిగిందని, పూర్తి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి, సాయం అందించుటకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ…

జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంయుక్తంగా సహాయ కార్యక్రమాలు, ముందస్తు జాగ్రత్తలు మాకు ఎంతో స్ఫూర్తిని కలిగి నియోజకవర్గంలో ప్రతిరోజు 18 గంటలు పైగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజలకు, రైతులకు ధైర్యాన్ని నింపామని అన్నారు.

కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ముందస్తు జాగ్రత్తలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వలన సురక్షితంగా తుఫాను నుండి బయటపడ్డామని అన్నారు. రై

తులు దేశానికి వెన్నుముక అని ఏ విధమైన ఆందోళన చెందవద్దని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టాలు జాబితా అందగానే పూర్తి అధ్యయనం చేసి రైతులు మనోభావాలను గౌరవిస్తూ మేలు చేసేలా ఒకమంచి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

జిల్లా కలెక్టరు వెంట ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, ఏయంసి చైర్మన్ యస్.జ్యోతి అయ్యప్ప, బిజెపి నియోజకవర్గ కన్వీనరు శరణాల మాలతీరాణి, ఏడిఏ పి.ఉషారాజు కుమారి, తహశీల్దారు వై.పూర్ణచంద్ర ప్రసాదు, యంపిడివో డి.రాజ్ మనోజ్, మండల వ్యవసాయ శాఖ అధికారి యన్.ప్రవీణ్, వివిధ శాఖలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, రెవిన్యూ, సచివాలయ ఉద్యోగులు, రైతులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.