The Desk…Undi : ఫోటో కొట్టు – ప్రైజ్ పట్టు…ఉండి నియోజకవర్గ ప్రజలకు విన్నపం..!!

The Desk…Undi : ఫోటో కొట్టు – ప్రైజ్ పట్టు…ఉండి నియోజకవర్గ ప్రజలకు విన్నపం..!!

🔴 ప.గో జిల్లా : ఉండి నియోజకవర్గం : THE DESK :

కాలువలు , డ్రెయిన్ లలో చాలా ఎక్కువగా చెత్త వేయడం జరుగుతుంది. ప్లాస్టిక్, వేస్ట్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వేయడం జరుగుతుంది.

ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బ్రిడ్జ్ లాంటివి ఉంటే పట్టేసి నీటి ప్రవాహానికి అంతరాయమే కాకుండా అనారోగ్యానికి కూడా కారణం అవుతుంది.

చెత్తను మనం తాగే నీటిలోకి కలపటం అంటే ఇంకా అంతకంటే దురదృష్టం మరొకటి లేదు ..ఎంతగానో చెప్పి చూడటం జరిగింది ..ముఖ్యంగా కలెక్టర్ అందరితో చర్చించిన మీదట నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే.. ఉగాది రోజు నుండి ఎవరైనా ఇండ్లలో నుండి కవర్ తీసుకొచ్చి చెత్త వేయడం.. దారిన వెళ్తూ సీసాలు పడేయడం కాలువ గట్టుల మీద.. కొన్ని పంచాయితీ వాళ్లు కూడా తీసుకొచ్చి చెత్త వేయడం జరుగుతుంది.

ఇటువంటి వాటికి అన్నీ కూడా మరి శాశ్వతంగా పరిష్కారం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కంపల్సరీగా అవసరం ఉంది కాబట్టి ఉగాది నుంచి ఎవరైనా కాలువలోకి గాని కాలువ గట్ల మీదకి గాని డిశ్చార్జ్ పడవేస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది.

అలాంటి వారిని గుర్తించి, తమ సెల్ ఫోన్లు ద్వారా ఎవరైనా ఫోన్లో ఆ ఫోటో బంధించి.. సంబంధిత పంచాయతీ సెక్రటరీకి గాని లేదా ఎమ్మెల్యే గారి ఆఫీస్ కి తెలియజేస్తే..కచ్చితంగా పట్టించిన వారికి ₹500 రూపాయలు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది.

ఆ వెయ్యి రూపాయలలో ₹500 రూపాయలు వీరికి ఇవ్వగా.. మిగిలిన ₹500 రూపాయలను కెనాల్ డెవలప్మెంట్ ఫండ్ లో జమ చేయడం జరుగుతుంది. వీరు చేసిన డ్యామేజ్ కి ఈ చర్యల వలన ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం ..దయచేసి పెనాల్టీ ఎవరి దగ్గర నుంచి మేము ఆశించట్లేదు .. ఒక్క పెనాల్టీ కూడా రాకపోతే మహదానందంగా భావిస్తాము.

పొరపాటున కూడా ఇటువంటి మన పరిసరాలనే మనం పాడు చేసుకునే దుస్థితి కలిగించవద్దని చెప్పి మరొకసారి వేడుకుంటూ …ఏప్రిల్ 30 ఉదయం నుంచే మరి ఎవరైనా తప్పు చేస్తే.. కాలువ గట్లు మీద అలవాటు ప్రకారం ఎవరైనా చెత్త వేస్తే.. పట్టేయండి ప్రైజ్ కొట్టేయండి.

“ఫోటోకొట్టు – ప్రైజ్ పట్టు” ఇది కాన్సెప్ట్…

ఉగాది నుండి కఠినతరమైన నిబంధనలు మన సమాజ శ్రేయస్సు కోసం మనం నిబంధనలు పెట్టుకోకపోతే కుదరదు కాబట్టి ₹1000 రూపాయల జరిమానా విధించబడుతుంది..

పట్టించిన వారికి ₹500 రూపాయలు బహుమానం ఇవ్వబడుతుంది.

➖RRR (ఏపీ డిప్యూటీ స్పీకర్ & ఉండి ఎమ్మెల్యే)

www.thedesknews.net