The Desk…Tenali : రాష్ట్రంలో పింఛన్ల పండగ – తెనాలిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

The Desk…Tenali : రాష్ట్రంలో పింఛన్ల పండగ – తెనాలిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

  • -రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ
  • -పెన్షన్ల పంపిణీ కోసం రూ.2,746.52 కోట్లు విడుదల
  • -తెనాలిలో 35,563 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 99 లక్షల 3 వేల రూపాయలు

🔴 గుంటూరు జిల్లా : తెనాలి : ది డెస్క్ :

కూటమి ప్రభుత్వం ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతినెల ఒకటవ తేదీన 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు రూ. 2,746.52 కోట్లు అందజేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.గుంటూరు జిల్లా, తెనాలి నియోజకవర్గం జాగర్లమూడి గ్రామంలో సుల్తానాబాద్ నందు పలు కాలనీలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. తెనాలి నియోజకవర్గంలో 35,563 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 99 లక్షల 3 వేల రూపాయలు పెన్షన్ మొత్తాన్ని అందజేస్తున్నామన్నారు.పెన్షన్ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా, లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్ అందజేస్తున్నామన్నారు.సాధారణ పెన్షన్‌ను రూ. 2000 నుంచి రూ. 4000 కు, దివ్యాంగులకు రూ. 6 వేలు, 10 వేలు, 15 వేలు పెన్షన్ పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు వంటి నిరుపేద, నిస్సహాయ వర్గాల కష్టాలను తొలగించడానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. దేశంలో సామాజిక భద్రతా పెన్షన్ కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని మంత్రి తెలియజేశారు.అర్హతలు ఉన్న లబ్ధిదారులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు,

నూతనంగా వితంతు పెన్షన్లు కూడా నమోదు చేసుకున్న వారికి త్వరలో అందజేస్తామన్నారు. అదేవిధంగా జాగర్లమూడి లో సదరన్ క్యాంపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ ప్రాంత చరిత్ర,ఈ ప్రాంత అభివృద్ధి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకుందామన్నారు.

ఈ ప్రాంతంలో పాఠశాల అభివృద్ధికి, పంచాయతీ భవనం నిర్మాణానికి, రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని అర్హులు నమోదు చేసుకోవాలన్నారు.

కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి నెల రేషన్ పంపిణీ, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, వికలాంగులకు ప్రతినెల ఐదు రోజుల ముందు వారి ఇంటి వద్దకే రేషన్ అందజేయడం జరుగుతుందన్నారు… త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇంటి వద్దకే అందజేస్తారన్నారు. ప్రణాళిక బద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామన్నారు. ఈ నెలలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

ఈ ప్రాంతంలోని సైడ్ కాలువలు అధునీకరణ, రక్షిత మంచినీటి ఏర్పాటు చేస్తామన్నారు. నూతన రహదారి వెంబడి కూడా సైడ్ కాల్వ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. ఈ ప్రాంతం నిమ్మ రైతులకు ప్రసిద్ధి అని.. వారికి అండగా నిలబెడతామని హామీ ఇచ్చారు.