The Desk…Tenali : ప్రజల ఆరోగ్యమే -కూటమి ప్రభుత్వ ధ్యేయం : మంత్రి నాదెండ్ల

The Desk…Tenali : ప్రజల ఆరోగ్యమే -కూటమి ప్రభుత్వ ధ్యేయం : మంత్రి నాదెండ్ల

  • గ్రామీణులకు కార్పొరేట్ స్థాయి వైద్యం
  • ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల

🔴 గుంటూరు జిల్లా : తెనాలి : ది డెస్క్ :

గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఉన్న CHCలో ఈ వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. “వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు, డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేనివారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి” మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.

శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో లభించే వైద్య పరీక్షలు, సాధారణ శస్త్ర చికిత్సలు, స్త్రీల ఆరోగ్యం, పిల్లల వైద్యం, చెవి-ముక్కు-గొంతు, కంటి, దంత, గుండె సంబంధిత విభాగాలలో పరీక్షలు ఉచితంగా నిర్వహించి, మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో 20 మంది నిపుణులైన వైద్యులు, 50 మంది వైద్య సిబ్బంది సేవలందించారని మంత్రి వివరించారు.

అంతేకాదు, ఎక్స్‌రే, స్కానింగ్ మిషన్లు, సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. రాబోయే రోజుల్లో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.*డాక్టర్ గా మారిన మంత్రి – ప్రజలతో మమేకమైన నాదెండ్ల మనోహర్*తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మానవతా స్పర్శతో కూడిన ప్రత్యేక దృశ్యానికి వేదికైంది.

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉదయం 10 గంటల నుంచి ఆసుపత్రిలోనే గడిపారు.రాజకీయ అధికారి కార్యక్రమంలో ఎంతో బిజీగా మంత్రి, ఒక సాధారణ పౌరుడిలా వైద్య శిబిరంలో సేవలందించారు. ఆసుపత్రికి వచ్చిన ఓపీ (O.P) రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు.

అనంతరం తగిన విభాగ వైద్యుల వద్దకు వారికి స్వయంగా మార్గనిర్దేశం చేశారు.వైద్య పరీక్షలు, చికిత్సల ప్రగతిని స్వయంగా పర్యవేక్షించిన ఆయన, పరీక్షలు పూర్తయ్యాక అవసరమైన మందులు మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా అందించారు.