The Desk…Tenali : మంత్రి నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ

The Desk…Tenali : మంత్రి నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ

🔴గుంటూరు జిల్లా : తెనాలి : THE DESK NEWS :

కొత్త సంవ‌త్స‌రం రోజున తెనాలి క్యాంపు కార్యాలయంలో ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ S. నాగలక్ష్మీ, జాయింట్ కలెక్టర్ A.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, పౌర సరఫరా శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, జనసేన కార్యకర్తలు, ప్రజలు కలిసారు.

ఈ సందర్భంగా వారు పూల మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి అందరి శుభాకాంక్షలను స్వీకరించి, కొత్త సంవత్సరం అందరికీ శాంతి, సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలతో కలిసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు.