🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో బలసులమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ..
జాతర సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, భద్రత ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఉండాలని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, శానిటరీ సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పురపాలక సంఘ అధికారులు, దేవస్థానం అధికారులు మరియు పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
MLA Bolisetti Reviews Balasulamma Jatara Arrangements in Tadepalligudem
MLA Bolisetti Srinivas chaired a review meeting on Balasulamma Jatara preparations at the municipal office here. He directed officials to ensure all devotee facilities, airtight security, improved traffic control, parking, and sanitation. Municipal, temple, and police officials attended.

