The Desk…Tadepalligudem : ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2,00,000/- లక్షలు సొంత నగదును అందజేసిన బొలిశెట్టి శ్రీనివాస్

The Desk…Tadepalligudem : ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 2,00,000/- లక్షలు సొంత నగదును అందజేసిన బొలిశెట్టి శ్రీనివాస్

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆటోడ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా.. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఆటోరిక్షా, మాక్సి క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్స్ మొత్తము 1265 మందికి ఒక కోటి 89 లక్షల 75 వేల రూపాయల నిధులను విడుదల చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.

అనంతరం ఆదే సభలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తాను 2,00,000/- రూపాయలు తన స్వంత డబ్బులు ఇస్తానని మాట ఇచ్చారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు తన కార్యాలయంలో ఆటో డ్రైవర్ల నాయకులకు 2,00,000/- రూపాయల నగదును అందచేశారు.అలాగే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ రోజుకి రెండు రూపాయల చొప్పున యూనియన్ కు చందా క్రింద చెల్లించి, ఆ వచ్చిన డబ్బుతో కష్టంలో వున్న ఆటో డ్రైవర్ల కోసం ఉపయోగించాలని కోరారు.