ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం భారత దేశ స్వతంత్రాన్ని నేడు మనము అనుభవిస్తున్నామని,భారతదేశ పౌరులుగా మన దేశ పరిరక్షణ మన బాధ్యత అని రాష్ట్ర విప్ ,తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.

మంగళవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎన్.డి. ఏ కూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో ప్రజలతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరంగా భారీ బైక్ ర్యాలీ పాల్గొన్నారు .ఈ ర్యాలీను హౌసింగ్ బోర్డ్ ఎస్వి రంగారావు విగ్రహం నుండి పోలీస్ ఐలాండ్ మోడరన్ కేఫ్ వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయలని పిలుపునిచ్చారు.
మన దేశ ఐక్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్క పౌరుడు తమతమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురువేయాలని ఆయన కోరారు. తద్వారా భారత జాతి ఐక్యతను చాటి చెప్పిన వారు అవుతామని అన్నారు.