The Desk … Tadepalligudem : ఎన్యూమరేటర్లు & సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం

The Desk … Tadepalligudem : ఎన్యూమరేటర్లు & సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ మరియు మెప్మా హాల్ నందు జనగణన–2027 కార్యక్రమం భాగంగా ఎన్యూమరేటర్లు మరియు సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అధ్యక్షత వహించారు.

ఈ శిక్షణలో ఫేజ్–1 హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్‌కు సంబంధించిన ముఖ్య అంశాలను వివరించారు. ఎన్యూమరేటర్లకు స్వీయ గణన (Self Enumeration – SE) విధానంపై ప్రత్యేక శిక్షణ అందించారు. దీనివల్ల వారు క్షేత్రస్థాయిలో డేటా సేకరణను సమర్థవంతంగా నిర్వహించగలరని అధికారులు తెలిపారు.

సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :.

జనగణన ద్వారా సేకరించే డేటా పట్టణ అభివృద్ధి ప్రణాళికలకు కీలకమని అన్నారు. ఖచ్చితమైన మరియు నాణ్యమైన సమాచారం సేకరించడం ద్వారా ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణంలోని వివిధ సచివాలయాల నుంచి ఎన్యూమరేటర్లు మరియు పురపాలక కార్యాలయం నుండి సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Training for Census Enumerators, Supervisors Held in Tadepalligudem

A training programme for enumerators and supervisors was conducted at the Council Hall and MEPMA Hall of Tadepalligudem Municipal Office as part of the Jan Ganan-2027 initiative. Municipal Commissioner M. Yesubabu chaired the session.

The training covered Phase-1 house listing, housing census essentials, and special focus on Self Enumeration (SE) methods to enable efficient field data collection, officials said.

Addressing participants, Commissioner Yesubabu emphasized, “Census data is crucial for urban development plans. Accurate, quality information will help the government formulate comprehensive strategies.”

Enumerators from local secretariats and supervisors from the urban office attended, gearing up for precise data gathering.