🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్” ఇతివృత్తంపై శశి విద్యాసంస్థల్లో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ :
వ్యర్థాల విభజన, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం, కంపోస్ట్ తయారీ గురించి వివరిస్తూ.. “స్వచ్ఛ తాడేపల్లిగూడెం” సాధనకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగు వేణు గోపాల కృష్ణ , డిప్యూటీ ఇంజనీర్ రామారావు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ హరీష్ , సానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరావు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రజిని , సానిటేషన్ సెక్రటరీలు, శశి కాలేజ్, విద్యార్థులు పాల్గొన్నారు.

