🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్, స్వర్ణ ఆంధ్రా స్వచ్ ఆంధ్రాలో భాగంగా…తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఎమినిటీస్ సెక్రటరీలకు , సానిటేషన్ సెక్రటరీలకు మరియు సానిటేషన్ వర్కర్స్ కు స్థిరమైన ఘన వ్యర్థాలు మరియు వాడిన నీటి నిర్వహణపై ప్రభావవంతమైన అవగాహన కల్పించడం కొరకు సామర్ధ్యం పెంపుదల శిక్షణను స్థానిక మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్ నందు ఈ రోజు కంప్లీట్ చేయుట జరిగింది.
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను నాలెడ్జింగ్ పార్టనర్స్ సహస్ మరియు వాష్ ఇన్స్టిట్యూట్ సంస్థల సహకారంతో ఎంతో అట్టహాసంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ శిక్షణ కార్యక్రమంను 40 మంది సెక్రటరీలకు శిక్షణ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం.యేసుబాబు మాట్లాడుతూ :
ఫీల్డ్ లెవెల్ ఈ శిక్షణ అనంతరం స్వర్ణ ఆంధ్రా – స్వచ్ ఆంధ్రా కార్యక్రమాలు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని, కంపోస్టింగ్ విధానము అలాగే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మొదటి స్థానం కొరకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కొనియాడారు. మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్లు , మెప్మా CMM సుధాకర్, COs, వాష్ ఇన్స్టిట్యూట్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ P. రాము, రిసోర్స్ పర్సన్ టీ.మధుసూదనరావు, వాలంటీర్ నిర్మల మరియు పుష్ప, SHG MEPMA RP’s పలువురు పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ అనంతరం సెక్రటరీలకు మరియు వర్కర్స్ కు కమిషనర్ చేతులమీదుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ప్రజెంటేషన్ చేయుటతో పాటు యన్. రజని స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా ప్రతిజ్ఞను సెక్రటరీలతో చేయించారు.

