The Desk … Tadepalligudem : మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు శిక్షణా ముగింపు కార్యక్రమం

The Desk … Tadepalligudem : మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు శిక్షణా ముగింపు కార్యక్రమం

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్, స్వర్ణ ఆంధ్రా – స్వచ్ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు స్థిరమైన ఘన వ్యర్థాలు మరియు వాడిన నీటి నిర్వహణపై ప్రభావవంతమైన అవగాహన కల్పించడం కొరకు సామర్ధ్యం పెంపుదల శిక్షణను స్థానిక మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్ నందు ఈ రోజు ముగింపు కార్యక్రమం జరిగింది.

ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను నాలెడ్జింగ్ పార్టనర్స్ సహస్ మరియు వాష్ ఇన్స్టిట్యూట్ సంస్థల సహకారంతో ఎంతో అట్టహాసంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని 65 మంది మెప్మా ఆర్పిలకు శిక్షణ ఇచ్చారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులైన మున్సిపల్ కమిషనర్ ఎం.యేసుబాబు మాట్లాడుతూ :

ఫీల్డ్ లెవెల్ ఈ శిక్షణ అనంతరం స్వర్ణ ఆంధ్రా – స్వచ్ ఆంధ్రా కార్యక్రమాలు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని, కంపోస్టింగ్ విధానము,అలాగే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మొదటి స్థానం కొరకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కొనియాడారు.

మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్లు , మెప్మా సిఎంఎం సుధాకర్,cos వాష్ ఇన్స్టిట్యూట్ , కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ P. రాము, రిసోర్స్ పర్సన్ టీ.మధుసూదన రావు, వాలంటీర్ నిర్మల మరియు పుష్ప, SHG మెప్మా ఆర్పీలు మొదలగు వారు పాల్గొన్నారు.ఈ ట్రైనింగ్ అనంతరం మెప్మా ఆర్పి లకు కమిషనర్ చేతులమీదుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ప్రజెంటేషన్ చేయుటoతో పాటు యన్. రజని స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా ప్రతిజ్ఞను ఆర్పిలతో చేయించారు.

MEPMA Resource Persons Complete Training in Tadepalligudem

The valedictory function of a capacity-building training program for MEPMA Resource Persons on sustainable solid waste and used water management concluded successfully at the Tadepalligudem Municipal Council Meeting Hall today. Organized by Swachh Andhra Corporation under the Swarna Andhra-Swachha Andhra initiative, the program was conducted with great enthusiasm in collaboration with Knowledge Partners Saahas and WASH Institute.

A total of 65 MEPMA Resource Persons (RPs) benefited from the comprehensive sessions aimed at creating effective awareness among the public.

Municipal Commissioner M. Yesubabu, the chief guest, urged the field-level participants to actively promote Swarna Andhra-Swachha Andhra programs, emphasizing composting techniques. He commended their efforts and called for collective action to secure the top position in the Swachhta Survey Awards for Tadepalligudem Municipality.

Municipal Sanitation Inspectors, MEPMA CMM Sudhakar, WASH Institute COS, Capacity Building Coordinator P. Ramu, Resource Person T. Madhusudhana Rao, volunteers Nirmala and Pushpa, along with SHG and MEPMA RPs attended. Certificates were distributed by the Commissioner, followed by the Swachh Andhra-Swarna Andhra pledge led by YN. Rajani.