The Desk … Tadepalligudem : హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ & మెడికల్ క్యాంప్

The Desk … Tadepalligudem : హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ & మెడికల్ క్యాంప్

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలోని వీకర్స్ కాలనీ, ఎన్టీఆర్ జంక్షన్, కడకట్ల ఆరోగ్య కేంద్రాలలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం జరిగింది.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను నివారిస్తుందని, ఈ వ్యాక్సిన్ 14-15 ఏళ్ల బాలికలకు వేయటం జరుగుతుందని, సింగిల్ డోస్ టీకా కార్యక్రమం 90 దేశాల్లో అమల్లో ఉంది కాబట్టి పబ్లిక్ అర్బన్ హెల్త్ సెంటర్స్ లో ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా వేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వైద్యులు పాల్గొన్నారు.

అర్బన్ హెల్త్ సెంటర్‌లో మెడికల్ క్యాంప్ :

వీకర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ కోసం మెడికల్ క్యాంప్ నిర్వహించారు.

మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో.. పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్‌కు మెడికల్ టెస్టులు నిర్వహించి, మెడిసిన్‌ను అందించారు.

పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమని, అది పురపాలక సంఘం బాధ్యతని, మెడికల్ క్యాంప్ నిర్వహించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, మెడిసిన్‌ను అందించడం జరిగిందిని తెలిపారు.

HPV Vaccination Drive and Medical Camp Held in Tadepalligudem

In a proactive health initiative, the Tadepalligudem Municipal Council administered HPV vaccines to 14-15-year-old girls at Weavers Colony, NTR Junction, and Kadakatla health centers. The vaccine prevents cervical cancer, with a single-dose program implemented in 90 countries. Free vaccinations are available at public urban health centers, officials said.

Municipal Commissioner M. Yesubabu and MLA Bolisetty Srinivas participated alongside doctors.

Separately, a medical camp at Weavers Colony Urban Health Center provided tests and medicines to public health and sanitation workers under Commissioner Yesubabu’s guidance. “Safeguarding workers’ health is our responsibility,” he emphasized.