🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం 13, 14, 15, 16 వార్డులలో స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమాలపై కాపు కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వార్డు ఇంచార్జిలు, సెక్రెటరీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమాల విజయానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పురపాలక సంఘం అధికారులు తెలిపారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు :
▪️వార్డులలో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం
▪️ప్రజలకు స్వచ్ఛతా గురించి అవగాహన కల్పించడం
▪️వార్డులలో చెత్త సేకరణ వ్యవస్థను మెరుగుపరచడం
▪️స్వచ్ఛతా కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం
▪️స్వచ్ఛ తాడేపల్లిగూడెం పట్టణాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టడం.
▪️ప్లాస్టిక్ ఉపయోగాన్ని నివారించడం, బహిరంగ మలవిసర్జన నివారించడం,తడి చెత్త ,పొడి చెత్త ను వేరు చేసి ఇవ్వడం గురించి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Swachh Bharat Drive: Tadepalligudem Municipality Holds Key Meeting
In a bid to boost cleanliness initiatives, Tadepalligudem Municipal Council organized a meeting at Kapu Kalyana Mandapam focusing on Swachh Survekshan, Swachh Bharat, Swachh Andhra, and Swachh Tadepalligudem campaigns. Chaired by Municipal Commissioner M. Yesubabu, the session drew ward in-charges, secretaries, and public representatives from wards 13 to 16.
Officials stressed the need for public participation to ensure success. Key resolutions included conducting ward-level cleanliness drives, creating awareness, improving waste collection, enhancing community involvement, and aiming for top rank in the state. The meet also resolved to curb plastic use, open defecation, and promote wet-dry waste segregation.

