🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయంలో ఉదయం 9 నుండి 10 గంటల వరకు “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏసుబాబు ప్రజల నుండి ఫోన్ కాల్స్ స్వీకరించి, వారి సమస్యలను విని, పరిష్కార మార్గాలు సూచించారు.
ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా నివేదించి, కమిషనర్ నుండి తక్షణమే పరిష్కారాలు పొందారు. ఈ కార్యక్రమం ప్రజలకు మరియు పురపాలక సంఘానికి మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు పురపాలక సంఘం అధికారులు పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారానికి సహకరించారు.
Commissioner Addresses Public Grievances in Tadepalligudem
Municipal Commissioner yesu Babu held the “Dial Your Commissioner” program at the Tadepalligudem Municipal office from 9-10 AM today. He received phone calls from residents, listened to their issues, and suggested immediate solutions. Officials assisted in grievance redressal. The initiative aims to strengthen ties between the public and municipality.

