🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ద్వారా ఇంటింటి వ్యర్థాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పొడి వ్యర్థాలు (డ్రై వేస్ట్) మరియు తడి వ్యర్థాలు (వెట్ వేస్ట్) విభజన చేసి సేకరించడం జరుగుతుంది.

ప్రతి ఇంటి నుండి సేకరించిన తడిచెత్తను – పొడిచెత్తను పెదతాడేపల్లిగూడెం బారతీయ విద్యా భవన్స్ వెంకట్ ఎకో ఫెర్టిలైజర్స్ వద్ద వర్మి కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో వర్మి కంపోస్ట్ తయారీ ప్రక్రియను కమిషనర్ ఎం ఏసుబాబు పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..
వర్మి కంపోస్ట్ తయారీ ప్రక్రియలో తడి వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి, వర్మి (వానపాములు) (వర్మిక్యులేట్) ద్వారా కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఈ కంపోస్ట్ వ్యవసాయంలో అధిక దిగుబడికి నాణ్యమైన పంట ఉత్పత్తికి,సురక్షిత & కలుషితం కానీ ఆహారం పొందడానికి రైతులు ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు, పురపాలక సంఘం అధికారులు, వెంకట్ ఎకో ఫెర్టిలైజర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tadepalligudem Municipality Launches Waste Segregation, Vermicompost Unit
Tadepalligudem Municipal Council has initiated door-to-door waste collection, segregating dry and wet waste to promote sustainability. Wet waste from households is now processed at a new vermicompost unit near Pedatadepalligudem Bharatiya Vidya Bhavans, in partnership with Venkata Eco Fertilisers.
Commissioner M. Yesu Babu inspected the facility, where earthworms convert organic waste into nutrient-rich compost. “This process yields high-quality, chemical-free fertilizer ideal for boosting crop yields and safe food production,” he stated, urging farmers to adopt it.
The event saw participation from municipal officials and Eco Fertilisers representatives.

