The Desk … Tadepalligudem : స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ తాడేపల్లిగూడెం

The Desk … Tadepalligudem : స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ తాడేపల్లిగూడెం

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

SASA కార్యక్రమంలో భాగంగా.. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ ఆదేశాల ప్రకారం ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా..ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడదామని, పొడిచెత్తగా తడిచెత్తగా వేరు చేసి మీ ఇంటికి వచ్చే సానిటేషన్ కార్మికులకు అందించాలని, ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడాలని, ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి, జీవ జాలానికి, మానవ ఆరోగ్యానికి కూడా హానికరమని, ప్లాస్టిక్ వ్యర్థాలు నేలలో కలిసి నీటి వనరులను కలుషితం చేస్తున్నాయని, ప్లాస్టిక్ వస్తువులను తగలబెడితే విష వాయువులు వాతావరణంలోకి విడుదలై, వాయు కాలుష్యానికి దోహదం చేస్తున్నాయని కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పౌరులందరినీ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా, కాగితం, జనపనార, మట్టి, వెదురు వంటి సహజ పదార్థాలతో తయారైన వస్తువులను మరియు గుడ్డ సంచులను వినియోగిద్దాం అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ ఎం ఎస్ బాబు, పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Swachh Andhra Rally Promotes Plastic-Free Tadepalligudem

In a spirited rally under the Swachh Andhra-Swachh Tadepalligudem initiative, the Tadepalligudem Municipal Council, following Commissioner orders, urged residents to curb plastic use and protect the environment.

Participants highlighted plastics’ harm to ecosystems, human health, soil, water sources, and air quality when burned, releasing toxic fumes. They called for segregating wet and dry waste for sanitation workers and switching to eco-friendly alternatives like paper, janapana leaves, clay, wood products, and cloth bags.

Commissioner MS Babu, along with municipal staff, secretariat employees, and MEPMA workers, joined the drive, rallying citizens for a sustainable future.