🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో భాగంగా.. తణుకు రోడ్డు ఆటో యూనియన్ సభ్యులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తాడేపల్లిగూడెంను సుందరీకరణలో, పరిశుభ్రతలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి స్వచ్ఛత, పచ్చదనం, ప్రజా శౌచాలయాల వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన నివారణ గురించి వివరించారు.
యూనియన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ కృషిని కొనియాడారు మరియు స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమ వంతు సాయం చేస్తామని అంగీకరించారు.
Auto Union Backs Cleanliness Drive in Tadepalligudem
Tadepalligudem Municipal Commissioner M. Yesu Babu met Tanuku Road Auto Union members under the Swachh Andhra-Swachh Tadepalligudem initiative. He urged focus on beautification, sanitation, greenery, public toilet usage, and preventing open urination to top state rankings. Union members praised his efforts and pledged support to raise public awareness.

