🔴పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

వాసవి ఇంజనీరింగ్ కాలేజీ, పెదతాడేపల్లిలో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో జోనల్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు హాజరయ్యారు.ఈ స్పోర్ట్స్ మీట్‌లో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని వివిధ క్రీడలలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కమిషనర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..
క్రీడలలో పాల్గొనడం వల్ల విద్యార్థులకు శారీరక ఆరోగ్యం మెరుగుపడి, మానసిక ఒత్తిడి తగ్గి, సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయని, ఆత్మవిశ్వాసం పెరుగి నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ , శచైతన్య స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
Sri Chaitanya School Hosts Zonal Sports Meet at Vasavi Engineering College
Vasavi Engineering College in Pedatadepalli hosted the Sri Chaitanya School Zonal Sports Meet, with Municipal Commissioner M. YesuBabu as chief guest. Students from various schools showcased skills in multiple events.
Addressing participants, the commissioner highlighted sports’ benefits: enhanced physical health, reduced stress, improved social skills, boosted confidence, and leadership development.
Jana Sena youth leader Bolishetty Rajesh, school principal, students, teachers, and officials attended.

