🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
మధ్యాహ్న భోజన పథకం అమలుపై పట్టణ కమిషనర్ ఏసుబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అధికారుల్లో అప్రమత్తత కలిగించారు. ఈ రోజు పట్టణంలోని సుబ్బారావుపేట ప్రభుత్వ హైస్కూల్‌ను అకస్మికంగా సందర్శించిన కమిషనర్, విద్యార్థులకు అందిస్తున్న మిడ్ డే మీల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించిన కోడిగుడ్ల నాణ్యత సంతృప్తికరంగా లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును సమగ్రంగా పరిశీలించేందుకు మున్సిపల్ కార్యాలయం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.
మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందిని నోడల్ అధికారులుగా నియమించి, ప్రతి పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.

