🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
బ్రహ్మ కుమారీస్ 90వ శివరాత్రి మహోత్సవం..!!
మానవుని మనసు అందరిదే ఒకటే..
దైవమంతా ఒకటే..

బ్రహ్మకుమారీస్ సంస్థ 90వ శివరాత్రి మహోత్సవ కార్యక్రమంలో 11 అడుగుల పుష్ప శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శివలింగం పువ్వులతో అలంకరించబడి, భక్తులకు దివ్యదర్శనం కలిగిస్తూ ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమీషనర్ దీపం వెలిగించి ప్రారంభించారు.

ఈ ఉత్సవంలో కమిషనర్ ఏసుబాబు మాట్లాడుతూ..
కులాలు ఎన్ని ఉన్నా.. మతాలు ఎన్ని ఉన్నా మానవుని మనసు అందరిదే ఒకటేనని, దైవమంతా ఒకటేనని, మనసు మంచిగా ఉంటే ఈ భూమి మీద కొంచెం స్వేచ్ఛగా ఉండవచ్చు అని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతకు పరిరక్షణకు బ్రహ్మకుమారిస్ సంస్థ కూడా తగినంత చేయూత ఇవ్వాలని ప్రసంగించారు.
బ్రహ్మకుమారిస్ 90వ శివరాత్రి మహోత్సవానికి సహాయ సహకారాలు అందించినందుకు మున్సిపల్ కమిషనర్ ఏసుబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Brahma Kumaris Marks 90th Maha Shivratri with Floral Shivling Spectacle in Tadepalligudem
Brahma Kumaris celebrated its 90th Maha Shivratri festival with an 11-foot floral Shivling as the highlight, captivating devotees with divine allure. Municipal Commissioner Easubabu inaugurated the event by lighting the lamp.
Addressing the gathering, Easubabu emphasized, “Human minds are one, divinity is one; a pure heart grants freedom on earth.” He urged the organization to support urban cleanliness and praised their contributions.
The hosts extended special thanks to the commissioner for his support.

