🔴 ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం :THE DESK NEWS :
గోవా పర్యటనకు వెళ్లిన తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ అనే యువకుడు దారుణహత్య..
మృతుని బంధువులు తెలిపిన వివరాలు మేరకు… తాడేపల్లిగూడెం పట్టణంలోని 6వార్డుకు చెందిన కొంతమందితో కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు గోవా ట్రిప్ కు వెళ్లిన రవితేజ మరియు స్నేహితులు.
మంగళవారం రాత్రి 1 గంట సమయంలో గోవాలోని ప్రముఖ కలంగుట్ బీచ్‌లో మెరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్ ఉంది.
రాత్రి ఒంటి గంటకు రెస్టారెంట్‌కు అర్థరాత్రి వచ్చిన ఫుడ్ ఆర్డర్ విషయంలో వాగ్వాదం..!!
అయితే, బంధువులు మాత్రం వీరిలో ఉన్న యువతిని అసభ్యకరంగా హోటల్ యజమాని కొడుకు సిల్వేరా మాట్లాడడంతో… రవితేజ, అతని స్నేహితుడు హైదరాబాద్‌కు చెందిన స్పందన్ ప్రతిఘటించిన వైనం…
అదే సమయంలో రెస్టారెంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రవితేజపై దాడి..
అలా చోటు చేసుకున్న వివాదం హింసాత్మకంగా మారిన వైనం నిందితులు టూరిస్ట్ తేజపై వెదురు కర్రలతో తలపై మోదారని, ఆపై శరీర భాగాలపై దాడి చేశారని, తీవ్ర గాయాలతో, నిందితులు కొట్టిన దెబ్బలకు తాళలేక బాధితుడు తేజ మృతి..
హోటల్ యజమాని కొడుకు యువతిపై అసభ్యంగా ప్రవర్తించడంతో యజమాని కొడుకుపై రవితేజ తిరగబడ్డడాని బంధువులు వెల్లడి.. మృతదేహం తాడేపల్లిగూడెం చేరుకోవడంతో శోక సంద్రంలో మృతుని బంధువులు..
www.thedesknews.net