🔴 అమరావతి : తాడేపల్లి : ది డెస్క్ :
ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి దేవాలయంలో ఈ నెల 26-03-2026 నుండి 05-04-2026 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న సీతారామ కల్యాణం మరియు కల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, నేడు తాడేపల్లిలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో ఆహ్వాన పత్రిక
అందిచడం జరిగింది.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంవారి ప్రతినిధులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, సీతారాముల వారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వాన పత్రిక స్వీకరించి, ఈ మహోత్సవాలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శివ ప్రసాద్, ఏఈవో బాలరాజు, టీటీడీ దేవస్థానం వెంకటాయిపాలెం సూపరింటెండెంట్ మల్లి ఖార్జున, ఆలయ వేద పండితులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

