The Desk …T.Narasapuram : శిరస్త్రాణం వినియోగంతో ప్రాణాపాయం 80 శాతం తప్పుతుంది : ఎస్ ఐ జయబాబు

The Desk …T.Narasapuram : శిరస్త్రాణం వినియోగంతో ప్రాణాపాయం 80 శాతం తప్పుతుంది : ఎస్ ఐ జయబాబు

ఏలూరు జిల్లా : టి.నరసాపురం : ది డెస్క్ :

హెల్మెట్ ధారణపై వాహన దారులకు వినూత్న అవగాహన కార్యక్రమమును టి.నరసాపురం ఎస్ ఐ జయబాబు బుధవారం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపిన 15 మంది వాహనదారు లతో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. పోలవరం డీఎస్పీ శ్రీ ఎం. వెంకటే శ్వరరావు గారి ఆదేశాల మేరకు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్ష కంటే పరివర్తన రక్షణే ముఖ్యం అన్నారు.

సాధారణంగా వాహన తనిఖీల సమయంలో హెల్మెట్ లేని వారికి పోలీసులు జరిమానా విధించడం పరిపాటి. కానీ ఒక అడుగు ముందుకేసి వినూత్నంగా ఆలోచిం చారు. కేవలం జరిమా నా విధించడం వల్ల వాహనదారుడి కి ఆర్థిక భారం తప్ప రక్షణ లభించదని భావించిన ఆయన, హెల్మెట్ లేకుండా ప్రయాణి స్తున్న 15మంది వాహనదారులకు అవగాహన కల్పించి, వారి క్షేమం కోసం అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు.అనంతరం వాహన దారులకు పలు కీలక సూచనలు చేశారు.

ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే గాయాలే మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయి, హెల్మెట్ ధరించడం వల్ల 80% ప్రాణాపాయం తప్పుతుందన్నారూ
మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి పనులు చేయ వద్దు. ప్రతి వాహన దారుడు ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించాలని హెచ్చరించారు.

వాహన తనిఖీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీ ప్రయాణం సురక్షితంగా సాగడానికే అని గుర్తించాలన్నారు.
పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు మరియు వాహన దారులు హర్షం వ్యక్తం చేశారు. జరిమానా కంటే ప్రాణ రక్షణ ముఖ్యమని చాటి చెప్పిన ఎస్ ఐ జయబాబు ను మరియు వారి సిబ్బందికి స్థానికులు అభినందనలు తెలిపారు.