The Desk…Satyavedu :  క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల స్క్రీనింగ్ ను ప్రారంభించిన జిల్లాల లెప్రసి అధికారి శ్రీనివాసులు

The Desk…Satyavedu : క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల స్క్రీనింగ్ ను ప్రారంభించిన జిల్లాల లెప్రసి అధికారి శ్రీనివాసులు

తిరుపతి జిల్లా : సత్యవేడు : THE DESK :

సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జిల్లా లెప్రసీ, టీ.బీ అధికారి డాక్టర్ శ్రీనివాసులు గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల స్కీనింగ్ సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ప్రాథమికంగానే గుర్తించడం జరుగుతుందన్నారు.

సర్వేలో ముఖ్యంగా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ తదితర వ్యాధులను ఆరోగ్య సిబ్బంది గుర్తిస్తారన్నారు. ఇప్పటికే దీనిపై ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఎంఎల్ హెచ్పీ లకు శిక్షణ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. వీరు ప్రతి పంచాయతీలోనూ రోజుకు 5 ఇండ్లు చొప్పున క్యాన్సర్ సంబంధిత వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఎన్సిడి.3 యాప్లో నమోదు చేస్తారన్నారు.

ఈ సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రాథమిక క్యాన్సర్ లక్షణాలను వారిని వైద్యులు మరోసారి పరిశీలన జరుపుతారన్నారు. అనంతరం క్యాన్సర్ హాస్పిటల్ తరలించి ఉచితంగా వైద్యం అందిస్తారన్నారు.ఆరోగ్యశ్రీ పథకంలోనూ దీన్ని వర్తింపు చేయడం జరుగుతుందన్నారు.

వయస్సు 18 సంవత్సరాల పైబడిన వారందరినీ సిబ్యాకు దరఖాస్తులో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు క్యాన్సర్ వంటివి లక్షణాలు ఉన్న వారందరిని గుర్తించి నమోదు చేస్తారన్నారు. అనంతరం క్యాన్సర్ నిర్ధారణ స్కీనింగ్ పరీక్షలను ఆయన రాష్ట్రీయ బాల స్వస్తిక్ కార్యక్రమ జిల్లా అధికారి ప్రభావతితో కలిసి ప్రారంభించారు.

కార్యక్రమంలో ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల వైద్యాధికారి సురేష్, దాసుకుప్పం వైద్యులు డాక్టర్ గుణశేఖర్,మురళీకృష్ణ,ఎంపిహెచ్సిఓ సుబ్రహ్మణ్యం, హెల్త్ అసిస్టెంట్ షణ్ముఖం,పలువురు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.