The Desk…Samarlakota : మరోసారి జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెరిసిన తౌఫిక్ అమన్

The Desk…Samarlakota : మరోసారి జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెరిసిన తౌఫిక్ అమన్

🔴 కాకినాడ జిల్లా : సామర్లకోట : ది డెస్క్ :

విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ (AP) ఆధ్వర్యంలో సామర్లకోట నందు నిర్వహించబడిన 4వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్షిప్-2025 నందు గ్రీన్ బెల్ట్ కటా విభాగంనందు గోల్డ్ మెడల్, కుమతే విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన తౌఫిక్ అమన్. విజయవాడకు చెందిన తౌఫిక్ అమన్ (6) రవీంద్రభారతి పబ్లిక్ స్కూల్, ప్రసాదంపాడు నందు 1st క్లాస్ చదువుతూ జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. అమన్ సాధించిన విజయాన్ని తాము సాధించిన విజయంగా అతని తల్లి తండ్రులు పేర్కొన్నారు. చిన్న వయసులో అమన్ సాధిస్తున్న విజయాలకు చాలా గర్వకారణంగా ఉన్నట్లు కోచ్ వాడో-ర్యూ కరాటే అకాడమీ డైరెక్టర్ జే.ఎం. దాస్ పేర్కొన్నారు.

ఈ జాతీయ స్థాయి పోటీలలో మెడల్స్ సాధించిన అమన్ ను 2026 ఫిబ్రవరి 21, 22న శ్రీలంక నందు జరగబోయే అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ కు పంపనున్నట్లు తల్లి తండ్రులు మరియు కోచ్ తెలిపారు. భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించే దిశగా అమన్ ను ప్రోత్సహిస్తున్నట్లు తల్లి తండ్రులు తెలిపారు.

Karate Prodigy Toufik Aman Shines at National Championships

In a stellar performance at the 4th National Level Open Karate Championship-2025, hosted by Victory Shotokan Karate Association (AP) in Samalkot, Kakinada district, six-year-old Toufik Aman from Vijayawada clinched gold in the Green Belt Kata category and bronze in Kumite. A first-grader at Ravindra Bharathi Public School, Prasadam Padu, Aman continues to dominate at the national level.

His parents hailed the achievements as their own victory, while Coach J.M. Das of Vado-Ryu Karate Academy expressed immense pride in the young talent’s early successes.

Aman is set to represent India at the International Karate Championship in Sri Lanka on February 21-22, 2026, with family and coaches backing him for global gold.