The Desk…RJY : హెల్త్ ఇస్ వెల్త్… ఈ – వేస్ట్ కలెక్షన్ కేంద్రాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు స్వచ్ఛందంగా అందచెయ్యండి

The Desk…RJY : హెల్త్ ఇస్ వెల్త్… ఈ – వేస్ట్ కలెక్షన్ కేంద్రాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు స్వచ్ఛందంగా అందచెయ్యండి

  • పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవ్వండి
  • స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ్ర లక్ష్యంగా ప్రతిజ్ఞ
  • ఈ వేస్ట్ కలెక్షన్ కియోస్కో స్టాల్ల్స్ ప్రదర్శన తిలకించిన అతిథులు

మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కమిషనర్ కేతన్ గార్గ్

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

ఎలెక్ట్రానిక్ వ్యర్థాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరియైన విధానంలో డిస్పోజ్ చెయ్యడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రక్రియ లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలువు ఇచ్చారు.స్థానిక బొమ్మూరు వైటీసీ ప్రభుత్వ కార్యాలయాలు సముదాయ ప్రాంగణంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతా మణి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి “స్వర్ణ ఆంధ్రా స్వచ్చ ఆంధ్రా” కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమం, ప్రజల ఆరోగ్యాన్ని కోసం ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే, అందుకు అనుగుణంగా సహాకారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో వైపు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర లక్ష్యంగా అనితర సాధ్యం చేసేలా కృషి చెయ్యడం జరుగుతోందని అన్నారు.  ఉన్న వస్తువులను సరైన విధంగా వాడడం, తిరిగి వాటిని ఉపయోగించడం, మరమ్మతులకి గురి అయిన వాటిని సరైన విధంగా డిస్పోజ్ చెయ్యాల్సి ఉంటుందన్నారు.

ఎలెక్ట్రానిక్ వ్యర్థాలు వల్ల అనారోగ్యం కు గురి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వాటి నుంచి వెదజెల్ల రేడియో యాక్టివిటీ వల్ల క్యాన్సర్, ఇతర అనారోగ్యం కు గురి కావడం చూస్తున్నామని తెలిపారు. ఎలెక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ, ప్రజలకు, ప్రకృతి కి జరిగే అనర్ధాలు వివరిస్తూ అడుగులు వేయడం జరుగుతోంది అని వివరించారు. ఇటువంటి వాటి విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వ్యవహరించకుండా బాధ్యత వహించాల్సి ఉంటుందని కోరారు.  ఎలెక్ట్రానిక్ వ్యర్థాలను సరియైన విధానంలో ఆలోచన చేసి మీ మీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏజెన్సీస్ కు అందచేయాలని పేర్కొన్నారు

సభాధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ… ఎలెక్ట్రానిక్ వ్యర్థాలు అంటే ఏమిటి, వాటి వల్ల పర్యావరణ కి కలిగే అనర్ధాలు ఫ్లెక్సీలు ద్వారా ప్రదర్శించడం జరిగిందన్నారు. ఎలెక్ట్రానిక్ వ్యర్థాలు ప్రమాద కారణంగా నిలిచే వాటిని సరియైన విధానంలో పారవేయడం చాలా ప్రాధాన్యత కూడిన అంశం అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించే, చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఇంట్లో ఎన్నో ఎలెక్ట్రానిక్ స్క్రాప్ ఉంటుందని, రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఈ వెస్ట్ కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, వాటిని సరైన విధంగా డిస్పోజ్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. 

ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చంద్ర మిషన్ ద్వారా రాష్ట్ర స్థాయిలో ఏజెన్సీస్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలెక్ట్రానిక్ వ్యర్థాలు వల్ల మన జీవన విధానంలో ఎంతో ప్రమాదకరం గా మారే అవకాశం ఉందని తెలిపారు.  ప్రతి ఒక్కరు తమ వంతుగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో వృథాగా ఉన్న ఈ వెస్ట్ గుర్తించి , ఈ వెస్ట్ కలెక్షన్ కేంద్రాలను అందచేయాలని కోరారు.

శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ..

వాతావరణంలో ఇంత వేడి తీవ్రత ఎక్కువగా ఉండడానికి ఎలెక్ట్రానిక్ వ్యర్థాలు ఒక కారణం అన్నారు. అవసరానికి మించి ఎలెక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి, పాత ఎలెక్ట్రానిక్ వ్యర్థాలు సరియైన విధంగా డిస్పోజ్ చేయకుండా ఉంచుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు.  కావున దేశ ప్రధాన నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి సంకల్పంతో స్వర్ణ ఆంధ్రా- స్వచ్చ ఆంధ్రా కార్యక్రమం ద్వారా ఒక మంచి సంకల్పంతో  ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందరం కలిసి కట్టుగా ఈ వెస్ట్ కలెక్షన్ కేంద్రాలను వ్యర్థాలను అందచేసి, స్వచ్ఛంధ్ర లక్ష్యంగా అడుగులు వేద్దాం అని పిలుపు ఇచ్చారు.

రాజమండ్రి రూరల్ స్పెషల్ అధికారి కేతన్ గార్గ్ మాట్లాడుతూ…

ఎలెక్ట్రానిక్ స్క్రాప్ పై ప్రత్యేక థీమ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం స్వాగతీయం అన్నారు. ఎలెక్ట్రానిక్ పరికరాలకి నిర్దేశించిన జీవిత కాలం ఉంటుంది, ఆ తర్వాత వాటిని సరైన విధంగా డిస్పోజ్ చెయ్యాల్సి ఉంటుందన్నారు.డిస్పోజ్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. తద్వారా ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుందని వివరించారు.

కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారి కేతన్ గార్గ్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి.శాంతామణి , రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ బలరాం, డి ఆర్ డి ఏ పి డి.. ఎన్ వి ఎస్ మూర్తి, డ్వామా పీడి ఏ. నాగమహేశ్వరరావు, డి ఎల్ డి వో పి వీణ దేవి, మండల ప్రత్యేక అధికారి కే ఎన్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.