The Desk…RJY : ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీ కోసం లో ప్రజల నుంచి 23 అర్జీలు

The Desk…RJY : ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీ కోసం లో ప్రజల నుంచి 23 అర్జీలు

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిచిన”పి జి ఆర్ ఎస్ – మీ కోసం” లో ప్రజల నుంచి 23 అర్జీలను స్వీకరించడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియ చేశారు.సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రజలనుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది.

ఈ సందర్భంగా కేతన్ గార్గ్ మాట్లాడుతూ…

నగర పాలక సంస్థ పరిథిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణా, మౌలిక సదుపాయాలు కల్పించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

కొన్ని అర్జీలు :

▪️ రాజమహేంద్రవరానికి చెందిన సునీల్ కుమార్ మిర్ర అనే వ్యక్తి నా పక్క ఇంటి బాత్రూం సమస్య పరిష్కారం కోసం వారి పాత బాత్రూము తొలగించవలసినదిగా కోరుతూ దరఖాస్తు చేసుకొని ఉన్నారు.

▪️ దానవాయిపేటకు చెందిన గంట నాగమణి అనే మహిళ మా ఇంటి వెనుక ఉన్న స్థలం ప్రభుత్వ స్థలం అని, ఆ స్థలమునకు డబ్బు కట్టవలసినదిగా నోటీసులు ఇచ్చి ఉన్నారు కావున సమస్యను పరిష్కరించవలసినదిగా దరఖాస్తు నందు పేర్కొన్నారు.

▪️ ఇంద్రసత్య నగర్ కు చెందిన ఎన్. వాసవి అనే మహిళ తమ ప్రాంతంలో ఆక్రమణలు తొలగించి రిజిస్ట్రేషన్ వారికి ఇళ్ల నిర్మాణం చేసుకునే వీలుగా దారి కల్పించవలసినదిగా కోరుతూ దరఖాస్తు నందు పేర్కొన్నారు.

▪️ ఇంద్రజిత్తు నగర్ కు చెందిన జి.రాళ్ల రాజ్యలక్ష్మి అనే మహిళ ఇంద్రజిత్తు నగర్ లో మాకు స్థలము ఉన్నది అక్కడ ఆక్రమణలు తొలగించవలసినదిగా కోరుతూ దరఖాస్తు చేసుకొని ఉన్నారు.

▪️ రాజమహేంద్రవరానికి చెందిన బండారు మల్లికార్జున రావు అనే వ్యక్తి మురికినీరు పోవు కాలువ నిర్మాణం కొరకు అభ్యర్థన అనేక సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ పరిష్కారం చూపలేక పోవుచున్నందున, సమస్య ను పరిష్కరించవలసినదిగా కోరుతూ విన్నపము.

కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకటరమణ, ఎస్.ఈ ఎం సిహెచ్ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ జి కోటయ్య , నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వి . వినూత్న తదితరులు పాల్గొన్నారు.