The Desk…RJY : 4వ తేదిలోపు లక్షమందితో స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ పూర్తి చేయాలి : ➖కేతన్ గార్గ్ IAS (కమిషనరు)

The Desk…RJY : 4వ తేదిలోపు లక్షమందితో స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ పూర్తి చేయాలి : ➖కేతన్ గార్గ్ IAS (కమిషనరు)

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : THE DESK :

స్వచ్ఛ్ భారత్ మిషన్ నిర్వహిస్తున్న స్వచ్ఛ్ సర్వేక్షణ 2024 పోటీలలో ముఖ్య కార్యక్రమమైన సిటిజన్ ఫీడ్‌బ్యాక్ (ప్రజా అభిప్రాయ సేకరణ) 4వ తేదిలోపు లక్ష మందితో ఫీడ్ బ్యాక్ పూర్తి చేయాలని ఈ నేపథ్యంలో, ప్రతి వార్డు సచివాలయ కార్యదర్శి సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌ను ప్రజల ద్వారా తప్పనిసరిగా సేకరించాలని, తద్వారా స్వచ్ఛ్ సర్వేక్షణ 2024 పోటీలో ఉత్తమ స్థానం సాధించే అవకాశం ఉందని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో నేడు సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భముగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ.. ప్రతి సచివాలయ కార్యదర్శి కనీసం 100 మంది ప్రజల ద్వారా ఫీడ్‌బ్యాక్‌ను పూర్తిచేయాలని, ఇప్పటికే రెండు వారాల క్రితం దీనిపై స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

అయితే, కొంతమంది మాత్రమే వాటిని పూర్తి చేశారని, మిగిలిన కార్యదర్శులు తమ నిర్ణయించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని అన్నారు. ఇప్పటివరకు 86,000 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారని, ఈ నెల 4వ తేదీలోపు లక్ష మందిచే సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌ను అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న ‘వర్క్ ఫ్రం హోమ్’ సర్వేను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

అనంతరం, సచివాలయ సిబ్బందితో వారివారి సచివాలయాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో డిప్యూటీ కమిషనర్ . ఎస్. వెంకటరమణ, సిటీ ప్లానర్ . జి. కోటయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం.సిహెచ్. కోటేశ్వరరావు , ఆరోగ్య అధికారి ఎ. వినూత్న , సెక్రటరీ శైలజ , మేనేజర్ అబ్దుల్ మలిక్ అస్ఫర్, అలాగే శానిటరీ సూపర్వైజర్లు, సచివాలయ సిబ్బంది మరియు నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.