🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది.

ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ.. నగర పాలక సంస్థ పరిథిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
కొన్ని అర్జీలు :
1) రాజమహేంద్రవరానికి చెందిన S.వరలక్ష్మి అనే మహిళ తనకు ఇంద్రనగర్ లో ఇల్లు ఉన్నదని, దానికి దారిలేనందున మున్సిపాలిటీవారు దారి పెంచ వలసినదిగా దరఖాస్తు నందు పేర్కొన్నారు.
2) రాజమహేంద్రవరానికి చెందిన D.శ్యామల అనే మహిళ ఇంద్రసత్య నగర్ లో ఆక్రమణలో ఉన్న తన స్థలాన్ని రీసర్వే చేసి తన స్థలాన్ని తమకు ఇప్పించ వలసినదిగా దరఖాస్తు చేసుకుని ఉన్నారు.
3) రాజమహేంద్రవరానికి చెందిన K.నాగ వెంకట దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి తన ఇంటి ప్రహరీ గోడ దాటి పక్క వారు వచ్చినందున తమకు హద్దులు గుర్తించి అప్పగించవలసినదిగా దరఖాస్తు చేసుకొని ఉన్నారు.
4) రాజమహేంద్రవరానికి చెందిన A.సుబ్బలక్ష్మి అనే మహిళ తన వీధిలో ఉన్న చెట్ల కొమ్మలు అడ్డుగా ఉన్నందున తొలగించవలసిందిగా కోరుతూ దరఖాస్తు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకటరమణ, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్న, ఎస్.ఈ ఎం సిహెచ్ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.