The Desk…RJY : ప్రజల రక్షణ కొరకు క్వారీ గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి ➖ కేతన్ గార్గ్

The Desk…RJY : ప్రజల రక్షణ కొరకు క్వారీ గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి ➖ కేతన్ గార్గ్

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్:

తరచూ క్వారీ గోతులలో పడి మనుషులు మరియు పశువులు ప్రాణాలు కోల్పోతున్నందున ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనరు కేతన్ గార్గ్, ఆదేశించారు. ది.06-05-2025 తేదిన 49వ డివిజనులో వున్న సున్నం బట్టి లే ఔట్ వద్ద నున్న క్వారీ గోతులను ఇంజనీరింగ్ మరియు పట్టణ ప్రణాళికా విభాగము అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భముగా కేతన్ గార్గ్ మాట్లాడుతూ… క్వారీ మొత్తాన్ని డ్రోన్ ద్వారా గోతుల యొక్క విస్తీర్ణము లోతు తదితరాలపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు, జంతువులు తరచూ గోతులలో పడటానికి అవకాశమున్న ప్రమాదకరమైన పాయింట్లను గుర్తించి మార్కు చేయాలని అన్నారు. డ్రోన్ సర్వే మాత్రమే కాక గోతులను పూర్తిగా పరిశీలించాలని అన్నారు. భవన నిర్మాణ వ్యార్ధాలతో క్వారీ గోతులను నింపటానికి తగిన చర్యలను తీసుకోవాలని, గోతుల చూట్టూ రోడ్డు మరియు ఫెన్సింగ్ ఏర్పాటు చేయటానికి అంచనాలను తయారు చేయాలని ఆర్ & బి అధికారులను ఆదేశించారు.

క్వారీ గోతులపై పూర్తిగా పరిశీలించి సమగ్ర నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టరు మేడమ్ కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసారు.ఈ సందర్శనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం.సిహెచ్.కోటేశ్వరరావు , సిటీ ప్లానరు జి.కోటయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదర్షా ఆలీ, 3వ పట్టణ సిఐ అప్పారావు, ఆర్ & బి డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, నగరపాలక సంస్థ టిపిబిఓలు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంటు ఇంజనీరు తదితరులు పాల్గొన్నారు.