The Desk…RJY : ప్రజా సమస్యల పరిష్కార వేదిక…19 ఆర్జీలు : – కమిషనర్ కేతన గార్గ్

The Desk…RJY : ప్రజా సమస్యల పరిష్కార వేదిక…19 ఆర్జీలు : – కమిషనర్ కేతన గార్గ్

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిచిన”పి జి ఆర్ ఎస్ – మీ కోసం” లో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరించడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియ చేశారు.సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది.

ఈ సందర్భంగా కేతన గార్గ్ మాట్లాడుతూ… నగర పాలక సంస్థ పరిథిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణా, మౌలిక సదుపాయాలు కల్పించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

మీకోసం లో స్వీకరించిన కొన్ని అర్జీలు :

▪️ రాజమహేంద్రవరానికి చెందిన గంగరాజు వెంకట్రావు అనే వ్యక్తి గతంలో అర్జీ నెంబర్ 25 03175720 దరఖాస్తు ద్వారా తమకు సమస్యను నిర్ణయించు కున్నాము, కానీ సమస్య పరిష్కారం ఆనందన మరల సమస్యను తమ దృష్టికి తీసుకువస్తున్నందున పరిష్కరించ వలసినదిగా కోరుతూ అర్జీ.

▪️ రాజమహేంద్రవరానికి చెందిన గోసాల చక్రవర్తి అనే వ్యక్తి తనకు సర్వే 17 లో 2.03 సెంట్లు భూమి ఉన్నదని పట్టాదారు పాసుపుస్తకం నందు తన పేరు నమోదు కాలేదని సమస్యను పరిష్కరించ వలసిందిగా దరఖాస్తు నందు కోరి ఉన్నారు.

▪️ కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన దంతం శెట్టి చిన వీర్రాజు అనే వ్యక్తి రాజానగరం మండలం రాజానగరం గ్రామమునందు ఆర్ఎస్ నెంబర్ 166/ 2ఏ లో తాను కొనుగోలు చేసిన స్థలం వివాదం పరిష్కరించవలసినదిగా కోరుతూ దరఖాస్తు.

▪️ అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన చింతా సురేష్ రెడ్డి అనే వ్యక్తి గ్రామపంచాయతీ వారు వేసిన సిమెంట్ రోడ్డు అసంపూర్తిగా వదిలేసి పర్మిషన్ లేకుండా వెళ్లిపోయినందున సమస్యను పరిష్కరించవలసిందిగా దరఖాస్తు నందు పేర్కొన్నారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర రావు, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వి. వినూత్న, ఎస్.ఈ ఎం సిహెచ్ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.