- పెండింగు బకాయిలు చెందిన 50 శాతం పెనాల్టీ లో రాయితీ
- -కమిషనర్ కేతన్ గార్గ్ (IAS)
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
రాష్ట్ర ప్రభుత్వము 5% రిబేటుతో యింటి మరియు ఖాళీస్థలముల యొక్క పన్ను చెల్లించుటకు, మరియు పెండింగు బకాయిలు చెందిన 50 శాతం పెనాల్టీ లో రాయితీ కల్పించిన అవకాశం ది.30-04-2025 వ తేదీతో ముగియనున్నదని, పన్ను చెల్లింపుదారులు సదవకాశాన్ని వినియోగించుకోవాలని నగర పాలక సంస్థ కమిషనరు కేతన్ గార్గ్ కోరారు.
స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయవనరైన ఆస్థిపన్నుకు సంబంధించి 2025-26 సంవత్సరము యొక్క పన్ను ఏకమొత్తముగా చెల్లించిన వారికి 5% రిబేట్ కల్పిస్తూ యిచ్చిన అవకాశం ది.30-04-2025 తేదీన ముగుస్తుందని, అలాగే బకాయిపన్నులపై వున్న వడ్డీని 50% తగ్గిస్తూ యిచ్చిన అవకాశం కూడా ది.30-04-2025 తేదీతో ముగిస్తుందని, ప్రజలు ఈ అవకాశమును అందిపుచ్చుకొని తమ పన్నులను చెల్లించాలని తెలియచేసారు.
ది.30-04-2025 తేదితో ఈ అవకాశం ముగిస్తున్నదని యింకనూ పన్ను చెల్లించని వారికి తెలియచేయాలని సచివాలయ పరిపాలనా కార్యదర్శులను మరియు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.