The Desk…RJY : ‘‘వాటర్ స్ప్రింకిల్డ్ మెషిన్’’ ద్వారా వేడి తీవ్రత, ధూళి తగ్గించే దిశగా చర్యలు  ➖కమిషనర్ కేతన్ గార్గ్

The Desk…RJY : ‘‘వాటర్ స్ప్రింకిల్డ్ మెషిన్’’ ద్వారా వేడి తీవ్రత, ధూళి తగ్గించే దిశగా చర్యలు ➖కమిషనర్ కేతన్ గార్గ్

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రొగ్రామ్ (NCAP) లో భాగంగా నగరంలో గాలి నాణ్యతను పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనరు కేతన్ గార్గ్ పేర్కొన్నారు. నవంబర్ 2024 నుండి రూ.48 లక్షల ఎన్కాప్ నిధులతో కొనుగోలు చేసిన ‘‘వాటర్ స్ప్రింకిల్డ్ ఫాగ్ కొనన్ మిస్టింగ్ మెషిన్’’ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ వాహనం ద్వారా మంచి నీటిని గాలిలోకి చల్లటం ద్వారా గాలిలోని కాలుష్యాన్ని తగ్గించబడుతుందని దుమ్ము మరియు ధూళిని నీటి బిందువులతో అణిచివేస్తుందన్నారు.

వేసవి దృష్ట్యా గాలి ఉష్ణోగ్రతను తగ్గించడం :

స్ప్రింక్లర్ల నుండి నీరు వెదజల్లడం ద్వారా , వేడి తరంగాల సమయంలో గాలిని చల్లబరుస్తుంది, ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

ధూళిని తొలగించండి :

స్ప్రింక్లర్లు నేల మరియు కాలిబాటను తేమగా మార్చడానికి సహాయపడతాయి, దుమ్ము తుఫానుల సమయంలో బలమైన గాలుల ద్వారా దుమ్ము ఎగిరిపోకుండా నిరోధించవచ్చు.

గాలి నాణ్యతను మెరుగుపరచండి :

ధూళిని తగ్గించడం ద్వారా, స్ప్రింక్లర్లు మొత్తం గాలి నాణ్యతను మెరుగు పరుస్తాయన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరంలో వాటర్ స్ప్రింకిల్డ్ ఫాగ్ కొనన్ మిస్టింగ్ మెషిన్ ద్వారా నీటి వెదజల్లే ప్రక్రియను కొనసాగించడం పట్ల నగర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.