🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : THE DESK :

ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమాలకు దాతలు సహకరించాలని నగర పాలక సంస్థ కమిషనరు కేతన్ గార్గ్ పిలుపు నిచ్చారు.
శుక్రవారం నగర పరిథిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు1,2,50 వార్డులు సంబంధించి లాలాచెరువు ఎన్.టి.ఆర్. విగ్రహం వద్ద , 25,26,27,28,29 వార్డులకి సంబంధించి మున్సిపల్ స్టేడియంలో వద్ద P-4 సమావేశ కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం జాంపేట చేపల మార్కెట్ వద్ద 24,30,32,33 వార్డులలో నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశాలలో కేతన్ గార్గ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-2047 దిశగా రాష్ట్రంలో ఉన్న 20% అత్యంత నిరుపేదల అభ్యున్నతికి ‘‘ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగ స్వామ్యంతో’’ ఆర్ధికంగా ఉన్న 10% అధిక సంపన్నుల లేదా తెలుగు ప్రవాసులు వ్యక్తుల సహకారముతో పేదరికం లేని సమాజాన్ని సాధించడానికి P-4 విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు.

P-4 విధానము అమలులో భాగంగా ది.08-03-2025 నుండి 20-03-2025 వ తేది వరకు ఇంటింటికి సర్వే నిర్వహించి 20% నిరుపేదల సమాచారాన్ని వార్డుల వారీగా సేకరించి ది.21-03-2025 నగరపాలక సంస్థ పరిధిలోని 13 వార్డులకు సంబంధించి లాలాచెరువు, మున్సిపల్ స్టేడియం మరియు జాంపేట ప్రాంతాలయందు వార్డు సభలు నిర్వహించి సదరు వివరములు ప్రదర్శించడమైనది.

సభలలో నగరపాలక సంస్థ అదనపు కమిషనరు pvరామ లింగేశ్వర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం.సిహెచ్.కోటేశ్వరరావు, సిటి ప్లానరు జి.కోటయ్య, డిప్యూటి కమిషనరు ఎస్.వెంకట రమణ, సెక్రటరీ శైలజవల్లి, ఇతర అధికారులు, సంబంధిత వార్డు ప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.