The Desk…Ravulapalem : ప్లాస్టిక్ నిషేధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

The Desk…Ravulapalem : ప్లాస్టిక్ నిషేధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

🔴 కోనసీమ జిల్లా : రావులపాలెం : ది డెస్క్ :

పర్యావరణానికి పెనుముప్పు తెచ్చే ప్లాస్టిక్ వస్తువుల (ఒక్కసారి వాడి పాడేసే) నిషేధానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పలువురు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా… ప్రతినెల మూడో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా శనివారం మండల కేంద్రమైన రావులపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ తాడేపల్లి నాగమణి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.

గ్రామసభలో ఉపసర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఎల్. దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడుతూ…

ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం కార్యచరణ రూపొందించిందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్లాస్టిక్ కవర్లు వంటివి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని.. అందుకు సంబంధించి విధించే జరిమానాలు అధికంగా ఉన్నాయని రావులపాలెం పంచాయతీ పరిధిలో ఎవరూ వాటిని విక్రయించకూడదన్నారు. వ్యాపారులకు తొలుత నోటీసులు కూడా జారీ చేస్తామని అయినప్పటికీ విక్రయిస్తే జరిమానా విధిస్తారని వివరించారు.అనంతరం ప్లాస్టిక్ నిషేధంకు సంబంధించిన ప్రతిజ్ఞ చేసి గ్రామంలో ర్యాలీ చేపట్టారు.

కార్యక్రమంలో వార్డు సభ్యులు సఖినేటి వాకులరాజు, వెలగల సత్యనారాయణ రెడ్డి, గ్రామ పెద్దలు పడాల కొండారెడ్డి, అచ్చిరెడ్డి కోట రమణీ దుర్గ, ద్వారంపూడి మోహన్ రెడ్డి,అంగనవాడీ సూపర్వైజర్ వై.హిమశ్రీ, పంచాయతీ, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.