The Desk… Rampachodavaram : ఉత్తమ జిల్లా అధికారిగా తూతిక శ్రీనివాస విశ్వనాధ్

The Desk… Rampachodavaram : ఉత్తమ జిల్లా అధికారిగా తూతిక శ్రీనివాస విశ్వనాధ్

🔴 పోలవరం జిల్లా : రంపచోడవరం : ది డెస్క్ :

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం అమలులో జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను పోలవరం జిల్లా ఉత్తమ జిల్లా అధికారిగా తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఎంపికయ్యారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అట్టహాసంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్, ఇతర అధికారులు చేతులు మీదుగా శ్రీనివాస విశ్వనాధ్ ఉత్తమ జిల్లా అధికారిగా అవార్డు అందుకున్నారు.

రంపచోడవరం డివిజన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టరుగా భాద్యతలు తీసుకున్న నాటినుండి ఉపాధిహామీ పథకం శ్రామికులకు మేలు జరిగేవిధంగా వారి సంక్షేమానికి శ్రీనివాస విశ్వనాధ్ కృషి చేసారు. భారత రక్షణ రంగం (నేవీ)లో 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత శ్రీనివాస విశ్వనాధ్ గ్రూప్ – 1లో ఎంపికై అనతికాలంలో మంచి అధికారిగా పేరు సంపాదించడమే కాక, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు, పేదలకు అందజేయడంలో ముందుంటూ పలువురు ప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగ విధులతో పాటుగా సామజిక సేవలో చురుకుగా పాల్గొనే శ్రీనివాస విశ్వనాధ్ పేదల మనిషిగా పేరు పొందారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దివ్యంగ, వితంతు, వృద్దాప్య, చేనేత, గీత సామజిక భద్రతా పింఛను పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’ అనే పేరును వీడియో కాన్ఫెరెన్సులో సూచించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు అందుకుని రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సమాజానికి, పేదలకు ఎన్నో సేవలు అందిస్తున్న ఎపిడి శ్రీనివాస విశ్వనాధ్ కు గతంలో అమెరికాలోని దాన సంస్థ 2014లో ‘వారియర్ అఫ్ పూర్’ పురష్కారం ఇచ్చి సత్కరించింది. అలాగే 2015లో సోషల్ సర్వీస్ విభాగంలో శ్రీనివాస విశ్వనాధ్ విశ్వకళా మండలి నుండి ‘ట్రూ ఇండియన్’ అవార్డు అందుకున్నారు.

అంతేకాకుండా శ్రీసత్యసాయి సేవ పురష్కారం, సర్ ఆర్థర్ కాటన్ జాతీయ పురష్కారం, గత గోదావరి మహాపుష్కరాలలో ఉత్తమ అధికారిగా ప్రభుత్వం నుండి, దళిత, గిరిజన, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ సామజిక న్యాయం కోసం పనిచేస్తున్నారని 2016లో హైదరాబాద్, సుందరయ్య కేంద్రంలో అంబేద్కర్ జాతీయ పురష్కారం ఇలా పలు సంస్థల నుంచి, ప్రజా సంఘాల నుంచి అనేక పురష్కారాలు అందుకున్నారు. శ్రీనివాస విశ్వనాధ్ సేవలను గుర్తించి అమెరికాలోని అంద్రూస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు.

ప్రస్తుతం పోలవరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హోదాలో శ్రామికులకు సకాలంలో పని కల్పిస్తూ, శ్రామికులు చేసిన పనికి జిల్లాలో అత్యధిక వేతనాలు కల్పిస్తూ జీ-రామ్-జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో ఆదివాసీలకు ఉపయోగపడేవిధంగా కృషి చేస్తున్నందుకుగాను శ్రీనివాస విశ్వనాధ్ ఉత్తమ జిల్లా అధికారిగా ఎంపిక అయ్యారు.

ఈసందర్భంగా ఎపిడి శ్రీనివాస విశ్వనాధ్ ను పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు ప్రశంసించారు.

Rampachodavaram: The Desk :

Tutika Srinivas Viswanath Named Top District Officer for MGNREGA Excellence

Tutika Srinivas Viswanath has been selected as the best district officer in Polavaram district for outstanding implementation of the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGA). The award was presented amid grand celebrations marking the 77th Republic Day at the local government junior college grounds on Monday. Joint Collector Baccu Smaran Raj and other officials honored him during the event.

Since taking charge as Assistant Project Director of the Rampachodavaram division, Viswanath has prioritized worker welfare, ensuring timely benefits under the scheme. A 15-year veteran of the Indian Navy, he cracked Group-1 exams and quickly earned acclaim for delivering government welfare programs to the needy. Known for social service alongside duties, he gained statewide recognition by suggesting ‘NTR Bharosa’ for the state pension scheme via video conference, earning Chief Minister Chandrababu Naidu’s praise.

His contributions extend further: In 2014, a US charity named him ‘Warrior of the Poor’; in 2015, Viswa Kala Mandali awarded him ‘True Indian’ in social service. He has also received Sri Sathya Sai Seva Puraskar, Sir Arthur Cotton National Award, a government honor for Godavari Pushkaralu, and the 2016 Ambedkar National Award from Hyderabad’s Sundarayya Centre for Dalit, tribal, and vulnerable welfare. Andrews University in the US conferred an honorary doctorate.

Currently with Polavaram Irrigation Project, Viswanath provides timely work and top wages to laborers, adapting J-Ram-J scheme for tribals—earning this top honor.

Local leaders, officials, and representatives congratulated EPD Viswanath on the occasion.