The Desk… Rampachodavaram  : సుస్థిర ఆస్తుల కల్పనే లక్ష్యంగా ఉపాధిహామీ పనులు జరగాలి : పిఓ స్మరణ్ రాజ్

The Desk… Rampachodavaram : సుస్థిర ఆస్తుల కల్పనే లక్ష్యంగా ఉపాధిహామీ పనులు జరగాలి : పిఓ స్మరణ్ రాజ్

🔴 అల్లూరి జిల్లా : రంపచోడవరం/గంగవరం : ది డెస్క్ :

ఏజెన్సీలో ఉపాధి పనులు ద్వారా చేపట్టిన పంట సంజీవిని పనులని వేగవంతంగా పూర్తి చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో సుస్థిర ఆస్తులు అభివృద్ధి చేసే లక్ష్యంగా ఉపాధిహామీ పనులు జరగాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బచ్చు స్మరణ్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రంపచోడవరం మండలం బీరంపల్లి వెలమల కోట, గంగవరం మండలం గ్రామంలోని పంట సంజీవిని పనులు ప్రాజెక్ట్ అధికారి ఆకస్మికంగా పర్యటించి గ్రామీణ శ్రామికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ మాట్లాడుతూ..

ఏజెన్సీలో ఉపాధి పనుల ద్వారా ప్రారంభించిన పనులని వేగవంతముగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఏజెన్సీలో ఏగ్రామంలోనైనా కొత్త పనులకు గ్రామసభల ద్వారా తీర్మానులు చేసి నివేదికల సమర్పించాలని ఆయన అన్నారు.
నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలో ఉపాధిహామీ పనులు సమర్ధవంతంగా నిర్వహిస్తే శ్రామికుల సంక్షేమంతో పాటుగా పోలవరం జిల్లాని ప్రగతి పథంలో నిలపచ్చని అన్నారు. ఉపాధిహామీ పథకంలో అక్రమాలు జరిగితే సంబంధిత సిబ్బంది మీద చర్యలు తప్పవని పిఓ స్మరణ్ రాజ్ హెచ్చరించారు. ఉపాధి పనుల ద్వారా 100 రోజుల నుండి 125 రోజులు ఉపాధి జాబ్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు కల్పించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి వారి వెంట అసిస్టెంట్ ప్రొజెక్ట్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్, మండల పరిషత్ అధ్యక్షులు పల్లాల కృష్ణారెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, ఏపీవోలు సురేష్, ప్రకాష్ ,టెక్నికల్ అసిస్టెంట్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

ITDA Project Officer Bachhu Smaran Raj directed officials to expedite Pant Sanjeevini works under MGNREGA in the Agency area and prioritize sustainable asset creation. During surprise inspections on Wednesday at Beerampalli Velamala Kota in Rampachodavaram mandal and Gangavaram village, he interacted with rural laborers, assessed progress, and addressed grievances.

Speaking on the occasion, Smaran Raj urged completing ongoing works swiftly and obtaining Gram Sabha resolutions for new projects before submission. “Efficient MGNREGA implementation in the new Polavaram district will boost worker welfare and district progress,” he stated. Warning against irregularities, he said strict action would follow. He mandated 100-125 days of employment for every job card holder.

Accompanying him were Assistant Project Officer Tootika Srinivas Viswanath, ZP Mandal Presidents Pallala Krishnareddy, MPD O Lakshman, APOs Suresh and Prakash, Technical Assistant Viranna, and others.